Advertisement

  • తన ట్వీట్లు బోరు కొట్టినా, విసుగు తెప్పిస్తున్నా మ్యూట్ చేసుకొవచ్చు: కంగనా

తన ట్వీట్లు బోరు కొట్టినా, విసుగు తెప్పిస్తున్నా మ్యూట్ చేసుకొవచ్చు: కంగనా

By: chandrasekar Tue, 10 Nov 2020 8:39 PM

తన ట్వీట్లు బోరు కొట్టినా, విసుగు తెప్పిస్తున్నా మ్యూట్ చేసుకొవచ్చు: కంగనా


కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ నటి కంగనా రనౌత్. ఏ విషయంలో అయినా తనకు అనిపించిన విషయాన్ని భయంలేకుండా మాట్లాడేస్తుంటారు కంగనా. సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్నిఆమె నిర్మొహమాటంగా చెప్పేస్తుంటారు. అయితే కొన్నిసార్లు కంగనా ట్వీట్లు చాలా మంది సెలబ్రిటీలకు వ్యతిరేకంగా కూడా ఉంటాయి. అవి అందరు నెటిజెన్లకు నచ్చకపోవచ్చు.

ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ నెటిజెన్ కంగనా తన ట్విట్టర్ ఖాతాలో సైలెంట్‌గా ఉంటే బాగుంటుందనే సలహా ఇచ్చారు. దీనికి స్పందించిన కంగనా.. తన ట్విట్టర్ ఖాతాను తరచుగా చూసే అభిమానులకు తన ట్వీట్లు బోరు కొట్టినా, విసుగు తెప్పిస్తున్నా తనని మ్యూట్ చేసుకొవచ్చు, బ్లాక్ చేసుకోవచ్చు లేదంటే నన్ను ఆపలేరు అంటూ చెప్పారు. తనను ద్వేషిస్తూ ప్రేమించొద్దనీ ఇంతకన్నాబెటర్ ఏదైనా ఉంటే చూసుకొమ్మనీ కంగనా తన ట్విట్టర్ అభిమానులకు తెలిపారు.

తాజాగా కంగనా అమెరికా అధ్యక్ష ఎన్నికల విషయంలో జో బెడెన్‌ను గజినీ బెడెన్‌గా పిలుస్తూ ట్వీట్ చేశారు. వైస్ ప్రెసిడెంట్‌గా కమలా హ్యరీస్‌కు తను సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపిస కంగనా.. 5 నిమిషాలకు ఒకసారి అన్నీ మరిచిపోయే గజినీ బెడెన్ గెలవడం కష్టమేనన్నారు. ఒక సంవత్సరం పాటు ఏమీ మర్చిపోకుండా ఉండేందుకు తగిన మందులు, ఇంజక్షన్లను జో బెడెన్‌కు ఇచ్చే ఉంటారన్నారు. మరోవైపు కమలా హరీస్ గెలుపు మాత్రం ఖాయమని చెబుతూ ఓ మహిళ ముందుకు వచ్చి ఎందరో ఆడవారికి స్పూర్తిగా నిలుస్తోంది. ఇది చరిత్రలో నిలిచిపోయే రోజవుతుందని కంగనా ట్వీట్ చేశారు. ఇక సినిమాల విషయానికొస్తే కంగనా.. తాజాగా తన తర్వాత సినిమా తేజస్ కోసం సిద్ధమవుతున్నారు. ఇందులో ఆమె ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

Tags :

Advertisement