Advertisement

  • ప్రొటీన్ పుష్కలంగా వున్న కందిప‌ప్పు వల్ల కలిగే లాభాలు

ప్రొటీన్ పుష్కలంగా వున్న కందిప‌ప్పు వల్ల కలిగే లాభాలు

By: chandrasekar Fri, 03 July 2020 8:12 PM

ప్రొటీన్ పుష్కలంగా వున్న కందిప‌ప్పు వల్ల కలిగే లాభాలు


శరీరానికి కావలసిన ప్రోటీన్లు అధికంగా పప్పుల్లో ఉంటాయి. ఇంటిలో ప్రతిరోజు వంటల్లో ముఖ్యంగా ఉపయోగించబడేది కంది పప్పు. పిల్లల నుండి పెద్దల దాకా అంద‌రూ కందిప‌ప్పును ఇష్ట‌ప‌డ‌కుండా ఉండ‌లేరు. కాక‌పోతే కందిప‌ప్పుతో చేసిన ప‌ప్పు రెసిపీ తింటే లావు అవుతారు. అస‌లే లాక్‌డౌన్ ఇంట్లో కూర్చొని ప‌ప్పు తింటుంటే ఇక అంతే ప‌ప్పు అంత‌గా తిన‌క‌పోవ‌డ‌మే మంచిది అంటుంటారు. మ‌రి ఇది ఎంత మాత్రం నిజం అన్న స‌న్నిగ్దంలో ఉండ‌గా నిపుణులు కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు. కందిప‌ప్పు వ‌ల్ల అన్నీ ప్ర‌యోజ‌నాలే. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవ‌ని నిర్థారించారు. వివరాల్లోకి వెళితే:

* ఇందులో ఉండే ఫైబ‌ర్ బ్లోటింగ్ లాంటి సమస్యల‌ను రాకుండా చేస్తుంది.

* కంది పప్పులో ఉండే బీ కాంప్లెక్స్, ఫాస్ఫరస్, మెగ్నీషియం, పొటాషియం, మెగ్నీషియం వల్ల దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు.

* కందిప‌ప్పులో ప్రొటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి.

* కంది పప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా చాలా తక్కువ. అందువల్ల దీన్ని డయాబెటిక్స్ కూడా హాయిగా తినచ్చు.

* కంది పప్పు తో ముద్దపప్పు, కంది పచ్చడి, కంది పొడి లాంటి వంటకాలు ఈజీగా చెయ్యచ్చు. పైగా కంది పప్పు కి ఉన్న రుచి ఇంకే పప్పుకీ రాదు.

* ప్రొటీన్ ఆరోగ్యానికి మందిది. శ‌రీరంలోని కొలెస్ట్రాల్‌ను బ‌య‌ట‌కు పంపించేందుకు ఫైబ‌ర్ దోహ‌ద‌ప‌డుతుంది.

* దీంతోపాటు కొలెస్ట్రాల్, సాచ్యురేటెడ్ ఫ్యాట్ చాలా తక్కువగా ఉంటాయి.

* ప‌ప్పుతో భోజనం చేస్తే సంపూర్ణంగా క‌డుపు నిండుతుంది. మ‌ర‌లా అంత తొంద‌ర‌గా కూడా ఆక‌లి అనిపించ‌దు.

Tags :
|

Advertisement