Advertisement

ఆరోగ్యాన్నిచ్చే అరటిపండు

By: chandrasekar Thu, 03 Sept 2020 09:49 AM

ఆరోగ్యాన్నిచ్చే అరటిపండు


చిన్న పిల్లల నుండి పెద్దల వరకు ఎవరైనా అరటిపండుని వద్దని చెప్పారు. మంచి పోషక విలువలతో బాటు రుచిగా కూడా ఉంటుంది. అరటి పండు ఇష్టపడనివారు ఎవరు ఉండరు. ఆకలిని దూరం చేయడమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా అందించే ఈ పండులో ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. తక్కువ ధరకే అందుబాటులో ఉండే అరటి పండును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. ఆటల సమయంలో ఇన్స్టంట్ గా ఎనర్జీ కోసం అరటిపండు తింటారు.

అరటిపండు చాలా రుచితో బాటు మంచి పోషక విలువలను కలిగి ఉంటుంది. ఇక బరువు విషయానికి వస్తే చాలామంది అరటి పండు తింటే బరువు పెరిగిపోతారని చెబుతుంటారు. కానీ, అది అవాస్తవం. రోజు అరటి పండును తినడం ద్వారా వ్యాయామం లేకుండానే బరువు తగ్గవచ్చు. అర‌టిపండ్లు తిన‌డం వ‌ల్ల క‌లిగే ఈ ప్రయోజనాలు గురించి తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు.

అరటి పండు క్యాన్సర్ కారకాలపై పోరాడుతుంది. అరటిపండులోని ఫైబర్ బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. రక్తంలోని చక్కెర స్థాయిలను అరటి పండు క్రమబద్ధీకరిస్తుంది. కిడ్నీల పనితీరును అరటి పండు మెరుగుపరుస్తుంది. బీపీని నియంత్రించడంలో అరటి పండు మంచి ఔషదం.

ఉడికించిన తృణధాన్యాలతో అరటిపండ్ల ముక్కలను కలిపి తీసుకుంటే మంచి రుచితో బాటు చాలా పోషక విలువలనిస్తుంది. గుండె సంబంధిత రోగాలను అరటి పండు దూరం చేస్తుంది. అరటిపండును కాలేయాన్ని శుభ్రం చేస్తుంది. అరటి పండులోని కెరొటినాయిడ్స్ కాలేయానికి మేలు చేస్తుంది. ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది.

దృష్టి లోపాలను అరికట్టడంలో అరటిపండు యాక్టీవ్‌గా పనిచేస్తుంది. అరటి పండులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. పొటాషియం గుండెకి ఎంతో మేలు చేస్తుంది. అరటి పండులో ఎక్కువ పొటాషియం ఉండడం వల్ల రోజు దీనిని తీసికోవాలి.

Tags :
|

Advertisement