Advertisement

  • మీ శరీరంలో ఉన్నా అనవసరపు కొవ్వు కరగాలి అంటే ఇలా చెయ్యండి...!

మీ శరీరంలో ఉన్నా అనవసరపు కొవ్వు కరగాలి అంటే ఇలా చెయ్యండి...!

By: Anji Tue, 01 Dec 2020 8:58 PM

మీ శరీరంలో ఉన్నా అనవసరపు కొవ్వు కరగాలి అంటే ఇలా చెయ్యండి...!

ఫిట్ నెస్ గా ఉంటే అనారోగ్యాలు దరి చేరవు. అంతేకాదు ఫిట్ నెస్ ఉంటే రోగ నిరోధక శక్తి ఆటోమేటిగ్గా పెరుగుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అయితే మీ శరీరంలో అనవసరపు కొవ్వు చేరి మీకు శత్రువులా మారుతోంది. అనవసరపు కొవ్వు శరీర ప్రదేశాల్లో పొట్ట దిగువ భాగంలో ఎక్కువగా పేరుకుంటుంది. దీన్ని వెంటనే తొలగించుకోవాలి.

లేకుంటే గుండె సంబంధిత వ్యాధులు, రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌ వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే పొట్ట దిగువ భాగంలోని కొవ్వును కరిగించడానికి సైక్లింగ్‌ ఉత్తమ మార్గం. రోజూ సైకిల్‌ తొక్కితే మీ శరీరంలోని కొవ్వు తేలికగా కరిగిపోతుంది.

శరీరంలో చెడు కొవ్వు నిల్వ ఉండి అనేక రకాల వ్యాధులకు కారణమవుతుంది. సైక్లింగ్‌ను కేవలం వర్కౌట్‌లా మాత్రమే కాక చిన్న చిన్న ట్రాన్స్‌పోర్ట్‌లా కూడా వాడడానికి ప్రయత్నించండి. దీనివల్ల మీ ఆరోగ్యమూ బావుంటుంది, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మీవంతు కృషి చేసినవారవుతారు.

మీకు ఖాళీ దొరికినప్పుడల్లా లేకుంటే వారానికి కనీసం రెండుసార్లయినా తప్పక సైకిలింగ్‌ చేయడం వల్ల మీరు ఒత్తిడి నుంచి దూరమౌతారు. మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మీరు రోజుకి ఒక అర గంట పాటు సైక్లింగ్‌ చేయగలిగితే మీ ఆరోగ్యం మీ చేతిలో ఉన్నట్లే. కాబట్టి తప్పకుండ ప్రయత్నించండి.

Tags :

Advertisement