Advertisement

కప్పు కాఫీతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా !

By: Sankar Tue, 20 Oct 2020 3:55 PM

కప్పు కాఫీతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా !


కాఫీ మన జీవితం లో కలిసిపోయింది. ప్రపంచవ్యాప్తం గా కూడా కాఫీ ఫ్యాన్ క్లబ్ పెద్దదే. అందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్, న్యూట్రియెంట్స్ వల్ల కాఫీ హెల్దీ కూడా. కాఫీ తాగేవారికి చాలా సీరియస్ డిసీజెస్ వచ్చే రిస్క్ తక్కువని కొన్ని స్టడీస్ ప్రూవ్ చేస్తున్నాయి. కాఫీ వల్ల ఉండే బెనిఫిట్స్ ఏమిటో ఇప్పుడు చూద్దాం.

1. కాఫీ వల్ల అలసట ఉండదు. ఎనర్జీ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఎందుకంటే, ఇందులో ఉన్న కెఫీన్ కాఫీ తాగిన తరువాత మీ బ్లడ్ స్ట్రీమ్ లోకి చేరుకుంటుంది. అక్కడ నుండి అది మీ బ్రెయిన్ లోకి వెళ్తుంది. కాఫీ జ్ఞాపకశక్తిని పెంచుతుంది, మూడ్ ని హ్యాపీ గా మారుస్తుంది, ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది, మెంటల్ ఫంక్షన్స్‌ని ఇంప్రూవ్ చేస్తుంది.

2. డిప్రెషన్ ఒక సీరియస్ మెంటల్ డిసార్డర్. ఇది లైఫ్ యొక్క క్వాలిటీ ని బాగా తగ్గిస్తుంది. మిగిలిన వారి కంటే రోజుకి నాలుగు కప్పుల కాఫీ తాగే వారిలో డిప్రెషన్ కి లోనయ్యే రిస్క్ ఇరవై శాతం తగ్గిందని స్టడీస్ చెబుతున్నాయి.

3. ప్రపంచవ్యాప్తం గా ఎక్కువ మంది చనిపోతున్న వ్యాధుల్లో కాన్సర్ కూడా ఒకటి. బాడీ లో సెల్స్ అదుపు లేకుండా పెరగడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాఫీ లివర్ మరియూ కొలొరెక్టల్ కాన్సర్లన్ నుండి ప్రొటెక్ట్ చేస్తుందని తెలుస్తోంది.

4. కెఫీన్ మీ నెర్వస్ సిస్టం ని స్టిమ్యులేట్ చేస్తుంది. అది ఎడ్రినలిన్ లెవెల్స్ ని కూడా పెంచుతుంది. ఈ హార్మోన్ ఇంటెన్స్ ఫిజికల్ యాక్టివిటీ కి బాడీని సిద్ధం చేస్తుంది. అందుకే, జిమ్ కి వెళ్ళబోయే అరగంట ముందు కాఫీ తాగితే మంచిది.

5. కాఫీ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది . ఎందుకంటే కాఫీ ఫ్యాట్ బర్నింగ్ ప్రొడక్ట్. కాఫీలోని కెఫిన్ శరీరంలో వేడి పుట్టించి, శరీరంలోని జీవక్రియలు వేగవంతంగా పనిచేయడానికి సహాయపడుతుంది. కొవ్వు విచ్చిన చేయడానికి సహాయపడి, త్వరగా కొవ్వు కరగడానికి సహాయపడుతుంది. త్వరగా స్లిమ్ గా మారాలని ఎక్కువ కాఫీ తీసుకోకూడదు. పరిమితంగా తీసుకోవాలి.

6. ఇది శరీరంలో అడ్రినాలిన్ రష్ ను పెంచుతుంది. దాంతో శారీరకంగా చురుకుగా ఉండటానికి సహాయపడుతుంది . కెఫిన్ వల్ల బ్రెయిన్ కు ఇది మరో ప్రయోజనం

7. మతిమరుపు మరియు డెమెంటియా వంటి వ్యాధులను తగ్గించడంలో లేదా నివారించడంలో కాఫీ గ్రేట్ గా సహాయపడుతుంది.


Tags :
|
|

Advertisement