Advertisement

  • కరోనా కష్టకాలంలో మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..

కరోనా కష్టకాలంలో మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..

By: Sankar Thu, 16 July 2020 5:01 PM

కరోనా కష్టకాలంలో మిరియాల వల్ల కలిగే ప్రయోజనాలు తెలుసుకోండి..



అసలే ఇది కరోనా విజృంభిస్తున్న సమయం పైగా వర్ష కాలం ..ఏ చిన్న దగ్గో , తుమ్మో వచ్చిన కరోనా అని భయపడుతున్నారు ..అందుకే తుమ్ములు , దగ్గులు లాంటివి రాకుండా ఉండాలంటే మనం తినే ఆహారంలో మిరియాలు ఉండేలా చూసుకోవాలి ..మిరియాల వలన ఆరోగ్యానికి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి ..అవి ఏంటో చూదాం ..

1. దగ్గు, జలుబు లాంటివి దరిచేరకుండా ఉండాలంటే మిరియాలు, శొంఠి పొడిచేసి, తేనె కలిపి రెండు రోజులకు ఒకసారి ఒక చెంచా చొప్పున తీసుకోవాలి. దంత సమస్యలకు మిరియాల పొడి, ఉప్పు మిశ్రమం తీసుకుంటే చక్కని పరిష్కారం ఉంటుంది.

2. గొంతులో గరగరగా ఉంటే గోరువెచ్చని పాలలో మిరియాల పొడి, పసుపు అరచెంచా చొప్పున వేసి, ఒక చెంచా తేనె కలిపి తాగితే ఉపశమనం లభిస్తుంది.

3. మిరియాలలో క్యాల్షియం, విటమిన్ సి, బీటా కెరోటిన్, అమైనో ఆమ్లాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి మంచి యాంటీ ఆక్సిడెంట్‌గా ఉపయోగపడుతాయి.

4. మిరియాల పొడిని, పసుపుతో కలిపి మూడు, నాలుగు రోజుల పాటు ముఖానికి రాసుకుంటే మొటిమలు తగ్గిపోతాయి. గాయాలపై మిరియాల పొడిని పూస్తే యాంటీ బ్యాక్టీరియల్‌గా పనిచేసి రక్తస్రావాన్ని అరికడుతుంది.

5. మిరియాల పొడి, నెయ్యి కలిపి రాస్తే ఎగ్జిమా, స్కేబిస్, ఇతర అలర్జీ సమస్యలు, చర్మ వ్యాధులు తగ్గుముఖం పడతాయి.

6. అధిక బరువు, కీళ్లవాతం, గ్యాస్ సంబంధ సమస్యలతో బాధపడుతున్నవారికి కూడా మిరియాల పొడి మేలు చేస్తుంది.

Tags :
|
|
|
|

Advertisement