Advertisement

బచ్చలి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

By: Sankar Thu, 16 July 2020 2:14 PM

బచ్చలి కూర వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..



ఆకుకూరల్లో బచ్చలి కూరకి ప్రత్యేకమమైన స్థానం ఉంది. ఇది తెలీని వాళ్లు అంటూ ఉండరు. దీనిలో పోషకాలతో పాటు అనేకరకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. బచ్చలిలో రెండు రకాలు ఉన్నాయి. తీగబచ్చలి, కాడబచ్చలి. ఎక్కువగా కాడబచ్చలి మనకి దొరుకుతుంది. తీగబచ్చలిని ఇంటి పెరట్లోకూడా పెంచుకోవచ్చు. దీనివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో చూద్దాం...

1. బచ్చలి ఆకు రసానికి చెంచాడు తేనె కలిపి ప్రతిరోజూ తీసుకుంటే రక్తహీనత (నియోనియా) సమస్య తగ్గుతుంది.

2. బచ్చలి కూరను ఆహారంలో తీసుకోవడం వలన చర్మానికి కొత్త మెరుపును ఇస్తుంది..

3. బరువు తగ్గాలనుకునేవారు బచ్చలి కూరను రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవాలి.

4. మూత్రవిసర్జనలో సమస్యలు ఉన్నవారు రోజూ బచ్చలికూర కషాయాన్ని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

5. బచ్చలి ఆకుల రసాన్ని కాలిన పుండ్ల మీద పెడితే పుండ్లు తగ్గుతాయి.

6. పచ్చకామెర్లు వచ్చి తగ్గాక బచ్చలి కూర తింటే త్వరగా కోలుకుంటారు.

7. బచ్చలి ఆకులను కందిపప్పుతో తింటే గర్భిణీలు ఎదుర్కొనే మలబద్ధకం సమస్య తగ్గుతుంది.

Tags :
|

Advertisement