Advertisement

ఇది మీకు తెలుసా...శనగలు తినడం వల్ల అనేక రకాల...!

By: Anji Wed, 18 Nov 2020 6:09 PM

ఇది మీకు తెలుసా...శనగలు తినడం వల్ల అనేక రకాల...!

శనగలు అరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. విలువైన పోషకాలున్న పప్పుధాన్యాల్లో శనగలు ఒకటి. వాటిని రోజు తినడం వల్ల అనేక రకాల ఉపయోగాలు ఉన్నాయి. పొట్టు తీసిన శ‌న‌గ‌పప్పును మ‌నం అనేక వంట‌కాల్లో వాడుతుంటాం.

కానీ పొట్టు తీయ‌కుండానే ల‌భించే శ‌న‌గ‌ల‌ను నాన‌బెట్టి, ఉడ‌క‌బెట్టి లేదా మొల‌క‌ల రూపంలో తింటే మ‌న‌కు ఎన్నో ర‌కాల ఆరోగ్య‌క‌ర ప్రయోజ‌నాలు క‌లుగుతాయి. ఉదయాన్నే మొలకల రూపంలో, చపాతీ, పూరీ కుర్మాగా లేదా రోజూ గుప్పెడు వేయించి తిన్నా ఎంతో ఆరోగ్యం. ప‌లు అనారోగ్య స‌మ‌స్య‌లు కూడా దూర‌మ‌వుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

రోజూ గుప్పెడు శనగలు తింటే వీటిలోని ప్రొటీన్ల మూలంగా శరీర అవసరాలకు తగిన శక్తి సమకూరుతుంది. అంతేకాకుండా శరీరపు రోగనిరోధక శక్తిని పెంచి పలు రోగాలు రాకుండా చేస్తుంది.పాల‌లో ఉండే కాల్షియంకు దాదాపు స‌మానమైన కాల్షియం శ‌న‌గ‌ల్లో ల‌భిస్తుంది.

దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. శరీరం మొత్తానికి బలాన్ని ఇవ్వడానికి శనగలు సహాయపడతాయి. ఇందులో పుష్కలంగా ప్రొటీన్స్ ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన తక్షణ శక్తిని అందిస్తాయి.

శనగలల్లో పుష్కలంగా ఉండే పీచు మలబద్దకాన్ని వదిలించి జీర్ణ సమస్యలు రాకుండా చేస్తుంది. మధుమేహులు రోజూ గుప్పెడు నానిన శనగలు తింటే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

శ‌న‌గ‌ల్లో పీచు ప‌దార్థం ఎక్కువ‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో ఉన్న కొలెస్ట్రాల్‌ను త‌గ్గించి వేస్తుంది. దీంతో గుండె సంబంధ స‌మ‌స్య‌లు రాకుండా చూసుకోవ‌చ్చు. శనగల్లోని ఎమినో యాసిడ్స్ రక్తకణాల ఎదుగుదల, ప్రసారానికి దోహదపడతాయి.

శ‌న‌గ‌ల‌ను త‌ర‌చూ తింటుంటే ర‌క్తంలో ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య పెరుగుతుంది. దీంతో ర‌క్తం బాగా ప‌డుతుంది. ఇది ర‌క్త‌హీన‌త ఉన్న వారికి ఎంత‌గానో మేలు చేస్తుంది. శ‌న‌గ‌ల్లో అమైనో యాసిడ్లు, ట్రిప్టోఫాన్‌, సెరొటోనిన్ వంటి ఉప‌యోగ‌క‌ర‌మైన పోష‌కాలు స‌మృద్ధిగా ఉంటాయి.

ఇవి చ‌క్క‌గా నిద్ర ప‌ట్టేలా చేస్తాయి. దీంతో నిద్ర‌లేమి దూర‌మ‌వుతుంది. అంతేకాదు ఒత్తిడి, ఆందోళ‌న వంటివి కూడా త‌గ్గిపోతాయి. శనగలు తిన్నప్పుడు చాలా సమయం ఆకలికాదు. కనుక బరువు తగ్గించుకోవాలనుకొనే వారు రోజూ గుప్పెడు నానిన శ‌న‌గ‌లు తినొచ్చు. ప‌చ్చ కామెర్లు, చర్మ సమస్యలకు శనగల వినియోగం మేలు చేస్తుంది.

Tags :

Advertisement