Advertisement

  • బాదంపప్పు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

బాదంపప్పు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Sat, 01 Aug 2020 09:46 AM

బాదంపప్పు తినడం వాళ్ళ కలిగే ఆరోగ్య ప్రయోజనాలు


బాదంపప్పు తినడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ..ముఖ్యంగా మెదడు బాగా పనిచేయడానికి బాదం బాగా పనిచేస్తుంది ..అలా అని కేవలం మెదడు ఆరోగ్యం ఒక్కటే గాక ల ఇంకెన్నో ప్రయోజనాలున్నాయి వాటిని కూడా తెలుసుకొంటే.. మీరు కచ్చితంగా వాటిని మీ రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటారనడంలో సందేహం లేదు.

1. మన రక్తంలో చేరిన టాక్సిన్లు, ఇతర హానికరమైన మలినాలను మన శరీరం నుంచి ఎప్పటికప్పుడు బయటకు పంపించాల్సి ఉంటుంది. బాదంలో ఉండే విటమిన్ ఇ యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది కణజాలాన్ని ఆక్సిడేషన్‌కి గురవకుండా కాపాడుతుంది. అలాగే శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపిస్తుంది. రోజూ చెంచా ఆల్మండ్ బట్టర్ తింటే.. రోజూవారీ మనకు అవసరమైన 30% విటమిన్ ఇ మనకు దొరుకుతుంది.

2. థ్లెట్లు, జిమ్‌కి వెళ్లేవారు.. ఎక్కువగా ప్రొటీన్ సహిత ఆహారం తీసుకొంటూ ఉంటారు. ముఖ్యంగా కండలు పెరగడం కోసమే ఇలా చేస్తుంటారు. మరి ప్రొటీన్లు అధికంగా దొరికే ఆహారం ఏంటో తెలుసా? బాదం పాలు. రోజూ పాలు తీసుకొనే అలవాటున్నవారు ఆ స్థానంలో బాదం పాలను తీసుకొంటే మీ రోజువారి అవసరాలకు తగినంత ప్రొటీన్ మీకు లభిస్తుంది.

3. మనం భోజనం చేసిన తర్వాత మనలోని ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి. రోజూ బాదం తినడం ద్వారా ఇన్సులిన్ స్థాయి అదుపులో ఉంటుంది. ఇవి గ్లూకోజ్ ను శరీరం బాగా శోషించుకొనేలా చేస్తాయి. ఫలితంగా మధుమేహం అదుపులో ఉంటుంది.

4. వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజం. అయితే బాదం నూనెను ఉపయోగించడం ద్వారా వీటిని రాకుండా చూసుకోవచ్చు. రోజూ చర్మానికి ఈ నూనెతో మసాజ్ చేసుకోవాలి. ఫలితంగా ముడతలు రాకుండా ఉంటాయి. అలాగే కళ్ల కింద నల్లటి వలయాలు కూడా రాకుండా ఉంటాయి.

5. తగినంత పీచుపదార్థం ఆహారం ద్వారా తీసుకోనట్లయితే జీర్ణసంబంధమైన సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా మలబద్దకం వచ్చే అవకాశాలున్నాయి. ఇలాంటి సమస్య రాకుండా ఉండాలంటే.. రోజూ బాదం పప్పులు తినాల్సిందే. దీనిలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థను క్రమబద్ధం చేసి మలబద్ధకం సమస్య రాకుండా చేస్తుంది. అలాగని ఎక్కువ మొత్తంలో తినాల్సిన అవసరం లేదు. రోజుకి నాలుగైదు బాదం పలుకులు తింటే చాలు.

6. ఎముకలు దృఢంగా ఉండటానికి అవసరమైన పోషకాలన్నీ బాదం గింజల్లో ఉంటాయి. ముఖ్యంగా దీనిలో ఉండే పాస్ఫరస్, క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే వయసు పెరగడం కారణంగా ఎముకల్లో వచ్చే మార్పులను రాకుండా బాదం గింజలు కాపాడతాయి. ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ మన దరికి రాకుండా చేస్తాయి

Tags :
|
|
|

Advertisement