Advertisement

పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

By: Sankar Tue, 14 July 2020 12:25 PM

పెరుగు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ..

భోజనం చేసేప్పుడూ ఎన్ని రకాల కూరలతో తిన్న కూడా చివర్లో పెరుగుతో తింటే వచ్చే సంతృప్తి అంతా ఇంతా కాదు..చిక్కటి పాలతో తయారు చేసే పెరుగు రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిది ..కానీ కొంతమంది పెరుగు తినడానికి అంతగా ఇష్టపడరు ..మరి అలంటి వారికోసమే ఇప్పుడు పెరుగు వలన ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయో తెలుసుకుందాం ...

1. పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. దీనివల్ల ఎముకలు గట్టిపడతాయి.

2. అధిక రక్తపోటు సమస్యలతో బాధపడేవారు రోజూ కప్పు పెరుగు తింటే మంచి ఫలితం ఉంటుంది.

3. తీవ్ర జలుబుతో బాధపడేవారు... పెరుగులో కాస్తా మిరియాల పొడి, బెల్లం పొడి కలిపి తింటే ఉపశమనం కలుగుతుంది.నేరుగా పెరుగు తినడం ఇష్టంలేనివారు, మజ్జిగ రూపంలో తీసుకోవచ్చు.

4. మజ్జిగలో కాస్తా నిమ్మరసం, ఉప్పు, జీలకర్ర పొడి కలుపుకుని తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవిలో డీహైడ్రేషన్ సమస్యలు ఉండవు.

5. వేడి వేడి అన్నంలో పెరుగు కలుపుకని తింటే విరేచనాలు తగ్గుతాయి.

6. జిగట విరేచనాలతో బాధపడేవారు పెరుగులో కొంచెం మెంతులు కలుపుకుని తింటే మంచి ఫలితం ఉంటుంది.వాతం, కఫాలను తగ్గించే గుణాలు పెరుగులో పుష్కలంగా ఉన్నాయి.

7. పెరుగులో కాస్తా ఉప్పు కలుపుకుని తినడం వల్ల అజీర్తి సమస్యులు తగ్గుతాయి.

8. శరీరంలో నీరు చేరినవారు పెరుగును ఎక్కవగా తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

Tags :
|
|
|

Advertisement