Advertisement

మెంతుల వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు

By: chandrasekar Wed, 08 July 2020 4:42 PM

మెంతుల వ‌ల్ల ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు


మెంతులు క‌ర్రీలో వేయ‌డం వ‌ల్ల రుచి వ‌స్తుంది. అలానే మంచి సువాస‌న‌ను వెద‌జ‌ల్లుతుంది. మెంతుల‌ను బాగా నాన‌బెట్టి రుబ్బిన‌ మిశ్ర‌మాన్ని జుట్టుకు ప‌ట్టిస్తే జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గిపోతాయి. ఇలా వంట‌లు, శిరోజాల‌కు మాత్ర‌మే కాకుండా నాన‌బెట్టిన మెంతులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటివ‌ల్ల ఎలాంటి ప్ర‌యోజ‌నాలు క‌లుగుతాయో చూద్దాం.

డ‌యాబెటిస్: నాన‌బెట్టిన మెంతులు ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిల‌ను నియంత్రించ‌డంలో అద్భుతంగా ప‌నిచేస్తాయి. మెంతులే కాకుండా ఆ నీరు కూడా ఉప‌యోగ‌ప‌డుతాయి. నాన‌బెట్టిన మెంతులు కంటే మొల‌కెత్తించిన మెంతుల‌లో 30-40 శాతం ఎక్కువ పోష‌కాలు క‌లిగి ఉంటాయి.

అసిడిటి: ఈరోజుల్లో అసిడిటి స‌మ‌స్య అంద‌రినీ బాధ పెడుతుంది. దీని నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి మెంతులు బాగా ఉప‌యోగ‌ప‌డుతాయి. ఉద‌యం నిద్ర‌లేవ‌గానే ఖాళీ క‌డుపుతో నాన‌బెట్టిన అర టీస్పూన్ మెంతులు తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అసిడిటి స‌మ‌స్య త‌గ్గుతుంది.

జీర్ణ‌క్రియ: మెంతులు అసిడిటిని దూరంగా ఉంచ‌డానికి స‌హాయ‌ప‌డుతాయి. నాన‌బెట్టిన మెంతులు జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డానికి కూడా తోడ్ప‌డుతుంది.

కొలెస్ట్రాల్: అధిక కొలెస్ట్రాల్‌తో బాధ‌ప‌డుతున్న వారికి నాన‌బెట్టిన మెంతులు చ‌క్క‌ని ప‌రిష్కారం. త‌ర‌చూ వీటిని తిన‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ప్ర‌తిరోజూ నాన‌బెట్టిన మెంతులు తిన‌లేక‌పోతే కూర‌ల్లో వేసుకొని తినేలా చూసుకోవాలి. రోజుకి ఒక టేబుల్‌స్పూన్ కంటే మించి తిన‌కూడ‌దు. ఈ ప‌ద్ధ‌తిని 21 రోజులు కంటిన్యూగా చేస్తే మంచి ఫ‌లితం ఉంటుంది.

Tags :
|
|

Advertisement