Advertisement

  • గోదావరి పెరుగుతున్న నీటిమట్టం... జాగ్రత్తాగా ఉండాలని హెచ్చరికలు

గోదావరి పెరుగుతున్న నీటిమట్టం... జాగ్రత్తాగా ఉండాలని హెచ్చరికలు

By: chandrasekar Mon, 17 Aug 2020 11:06 PM

గోదావరి పెరుగుతున్న నీటిమట్టం... జాగ్రత్తాగా ఉండాలని హెచ్చరికలు


గత కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానలతో భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం 61 అడుగులకు చేరింది. 2014 తర్వాత గోదావరికి ఈ స్థాయిలో వరద నీరు రావడం ఇదే మొదటి సారి అని అంటున్నారు అధికారులు.

ఇప్పటికీ పరీవాహక ప్రాంతాల నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఈ రాత్రికి గోదావరి నీటిమట్టం భద్రాచలం దగ్గర 63 అడుగులకు చేరుతుందని అంచనా వేస్తున్నారు. నీటిమట్టం పెరుగుతోందని లోతట్టు ప్రాంతాల ప్రజలు అలర్ట్ చేసింది కేంద్ర జలమండలి. జాగ్రత్తాగా ఉండాలని హెచ్చరికలు చేస్తోంది.

భద్రాచలం ఏజెన్సీ ఏరియాతో పాటు పినపాక నియోజకవర్గంలో వరద తీవ్రత ఉంటుందని భావిస్తున్నారు. ఈ క్రమంలో ముంపు మండలాల్లో అధికారులు అప్రమత్తం అయ్యారు. చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.

వరద కారణంగా వేల ఎకరాల్లో పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. నీటిమట్టం పెరుగుతుండడంతో ఖమ్మం నుంచి భద్రాచలం వైపు రాకపోకలను అదుపు చేస్తున్నారు. ఇప్పటికే భద్రాచలం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే బస్సులను ఆర్టీసీ రద్దు చేశారు.

Tags :
|

Advertisement