Advertisement

విటమిన్ డి లభించే ఆహారపదార్ధాలు ..

By: Sankar Sun, 12 July 2020 5:16 PM

విటమిన్ డి లభించే ఆహారపదార్ధాలు ..




మన శరీరానికి విటమిన్ల అవసరం ఎంతో ఉంది ..ఒక్కో విటమిన్ వలన ఒక్కొక ప్రయోజనం కలుగుతుంది ..అయితే అన్ని విటమిన్లు ఒకే రకం వాటిల్లో లభించవు అందుకే మనకు అన్ని విటమిన్లు అందాలంటే అన్ని రకాల పదార్ధాలను తినాలి ..అయితే విటమిన్ డి మాత్రం సూర్యుడు నుంచి ఫ్రీగా లభిస్తుంది అందుకే దీనిని ఫ్రీ విటమిన్ అంటారు ..అయితే ఇప్పుడు ఈ వర్షకాలంలో సూర్యుడు అంతగా రావడం లేదు ,,అందుకే సూర్యుడు నుంచి వచ్చే డి విటమిన్ సరిపోవడం లేదు ..డి విటమిన్ సరిగా అందకపోతే కాల్షియమ్ లోపం వలన పిల్లలో రికెట్స్ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ..పెద్దవాళ్లలో కూడా ఎముకలకు బలహీనంగా అయి విరిగిపోయి ప్రమాదం ఉంది అందుకే డి విటమిన్ లభించే ఆహారం తీసుకోవడం వలన ఈ వ్యాధులు రాకుండా కాపాడుకోవచ్చు ..ఇప్పుడు డి విటమిన్ ఇందులో ఎక్కువగా ఉంటాదో తెలుసుకుందాము ..

1. పాలు, పెరుగు, మజ్జిగ, ఛీజ్, బటర్, పన్నీర్...అన్నింటిలోనూ విటమిన్ డీ పుష్కలంగా ఉంటుంది. వీటితో పాటూ ఎగ్స్ కూడా చాలా మంచివి. అయితే ఎగ్స్‌ని యోక్ తో సహా తీసుకోవాలి. ఎందుకంటే విటమిన్ డీ ఉండేది ఎగ్ యోక్‌లోనే.

2. సాల్మన్, ట్యూన్న ఫిష్ లాంటి చేపల్లో విటమిన్ డీ ఉంటుంది. దాంతో పాటూ వీటిలో ఉండే కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ వల్ల ఇవి తీసుకుంటే మీ డైట్ న్యూట్రియెంట్ రిచ్ గా తయారౌతుంది.

3. మష్రూమ్స్‌లో ఫ్యాట్ తక్కువ, న్యూట్రియెంట్స్ ఎక్కువ. విటమిన్ డీ కూడా ఎక్కువే. వీటిని పైగా రకరకాల వంటల్లో వాడుకోవచ్చు. పీజా, పాస్తా, ఫ్రైడ్ రైస్, సాండ్విచ్, ఆమ్లెట్, స్టర్-ఫ్రైడ్ వెజ్జీస్ ఇలా ఇందులో అయినా వాడుకోవచ్చు ..

4. గోధుమలు, బార్లీ, రాగులు, ఓట్స్ లో కూడా విటమిన్ డీ లభిస్తుంది. అయితే వీటిని ప్రాసెస్ చెయ్యకుండా తీసుకోవాలి.

5. ఓట్ మీల్ లో దాదాపు మొత్తం విటమిన్ డినే ఉంటుంది మరియు ఇతర విటమిన్లు, పోషకాలు కూడా ఉంటాయి. ఒక అరకప్పు ఓట్ మీల్ దాదాపు 39 శాతం వరకు విటమిన్ డిని మీకు అందించగలదు. బ్రేక్ ఫాస్ట్ కి ఓట్ మీల్ తినడం మొదలుపెట్టండి, మీ విటమిన్ డి స్థాయి పెరుగుతుంది.



Tags :
|
|
|

Advertisement