Advertisement

  • హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే అర‌టిపండు, చెర్రీ తినాలని నిపుణుల సలహా

హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే అర‌టిపండు, చెర్రీ తినాలని నిపుణుల సలహా

By: chandrasekar Fri, 10 July 2020 6:13 PM

హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే అర‌టిపండు, చెర్రీ తినాలని నిపుణుల సలహా


ప్ర‌తిఒక్క‌రూ ఇప్పటి పరిస్థితులలో మాన‌సిక ఒత్తిడికి గుర‌వుతున్నారు. చిన్నా పెద్దా తేడా లేకుండా అంద‌రికీ ఈ స‌మ‌స్య రావ‌డం స‌హ‌జంగా మారిపోయింది. ఆస్ట్రేలియాలోని మకారీ యూనివర్సిటీ పరిశోధకులు దీనిపై ప‌రిశోధ‌న చేసి కొన్ని విష‌యాలు చెప్పుకొచ్చారు.

ప్ర‌తిరోజూ మ‌నం తినే ఆహారాన్ని బట్టి మాన‌సిక స్థితిని అంచ‌నా వేయొచ్చ‌ని అంటున్నారు. అంతేకాదు ఫాస్ట్ ఫుడ్‌, తీపి ప‌దార్థాలు, కొవ్వు, పాల ఉత్ప‌త్తులు తింటే మాన‌సిక ఒత్తిడి పెరుగుతుంద‌ని చెబుతున్నారు.

దీనిని అరిక‌ట్టేందుకు తాజా చేప‌లు, త‌క్కువ కొవ్వు ఉన్న మాంసాహారం, పండ్లు, కూర‌గాయ‌లను ఎక్కువ‌గా తీసుకోవ‌డం వ‌ల్ల ఒత్తిడిని త‌రిమికొట్టొచ్చ‌ని పేర్కొన్నారు.

ఎక్కువ క్యాల‌రీలు కాకుండా త‌క్కువ క్యాల‌రీలు ఉన్నఆహారం తీసుకున్న‌ప్పుడు హార్మోన్లు విడుద‌లై మెద‌డుపై భారాన్ని త‌గ్గిస్తాయి. చెర్రీ ఫ్రూట్స్, క్యాబేజీ, అరటిపండ్లు క్రమం తప్పకుండా తీసుకుంటే మానసిక ఆందోళనలు, ఇతర మానసిక సమస్యలు దూరమవుతాయట.

మ‌నిషిని ఉల్లాసంగా ఉంచే హ్యాపీ హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే అర‌టిపండు తినాల‌ని సూచిస్తున్నారు నిపుణులు.

Tags :
|
|

Advertisement