Advertisement

త్రిఫలలోని అద్భుతమైన ఔషధ గుణాలు

By: chandrasekar Thu, 18 June 2020 7:54 PM

త్రిఫలలోని  అద్భుతమైన ఔషధ గుణాలు


త్రిఫల అద్భుతమైన ఔషధం. ఆయుర్వేదంలో దీన్ని అనేక రకాలుగా ఉపయోగిస్తారు. త్రిఫల అంటే మూడు రకాల పధార్ధాలతో (కరక్కాయ, ఉసిరికాయ మరియు తానికాయ) తయారు చేయబడింది. మూడు ఫలాలను సమభాగాలుగా తీసుకుని చేసే చూర్ణాన్ని త్రిఫల చూర్ణం అంటారు. ఇది త్రిదోషాలను హరిస్తుంది. వాత, పిత్త, కఫాలతో ముడిపడిన రోగాలను పోగొడుతుంది. ఇది నిత్య రసాయనంగా కూడా చెప్పబడింది. రసాయనం అంటే వ్యాధినిరోధక శక్తిని పెంచేది. ఆ ప్రయత్నంలో దీన్ని రోజూ వాడుకోవచ్చన్నమాట.

కరక్కాయకు ఇంకోపేరు అభయ. అంటే అన్ని వ్యాధుల నుంచీ విముక్తికి అభయాన్నిచ్చేది. ఉసిరికాయలో విటమిన్‌-సి అధికంగ వుంది. ఇమ్యూనిటీని, జీర్ణశక్తిని పెంచే గుణాలన్నీ ఉసిరికాయలో ఉన్నాయి. కరక్కాయ, తానికాయ కషాయ రస ప్రధానమైనవి. ఉసిరి ఆమ్లరస ప్రధానమైంది. జీర్ణవ్యవస్థలోని అన్ని రకాల సమస్యలపై దీని ప్రభావం ఉంటుంది. సకల వ్యాధులనూ నిర్మూలించగలదు. నోట్లో పొక్కులు (అల్సర్లు), అజీర్తి, మలబద్ధ్దకం, అసిడిటీలకు త్రిఫల చూర్ణం బాగా పనిచేస్తుంది. కడుపుబ్బరం, గ్యాస్‌ సమస్యలకు ఇది విరుగుడు. త్రిఫల జీర్ణశక్తిని అభివృద్ధి చేయడమే కాకుండా వాతాన్ని కిందికి వెళ్లేటట్టు చేస్తుంది. అందువల్ల పేగుల కదలికలు బాగుంటాయి. నేత్ర సంబంధ సమస్యలకు కూడా త్రిఫల మంచి ఫలితాలను ఇస్తుంది.

ఆయుర్వేద శాస్త్ర ప్రకారం, త్రిఫల చూర్ణం జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు వయసుని పసిగట్టకుండా చేస్తుంది. అంతేకాకుండా, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, ఎర్రరక్తకణాల సంఖ్యను కూడా పెంచుతుంది. కడుపులో ఆమ్లత్వం వలన కలిగే ఇబ్బంది నుంచి విముక్తి కలిగించి, ఆకలిని పెంచుతుంది.

త్రిఫల చూర్ణం మూత్ర విసర్జనకి సహాయ పడుతుంది, మరియు ముత్ర నాళాలలో సమతుల్యతని కాపాడుతుంది. కాలేయం యొక్క ఆరోగ్యం కాపాడి, దాని యొక్క పనితనం పెంపొందిస్తుంది. కావున శరీరం విషపూరితమైన పదార్థాల నుంచి విముక్తి చేయబడుతుంది. ఊపిరితిత్తులలో తేమ మరియు శ్లేష్మం యొక్క సమతుల్యతని కాపాడి, శ్వాసకోశ వ్యాధుల నుంచి దూరంగా ఉంచుతుంది.

అంతే కాకుండా, త్రిఫల చూర్ణం కండరాల స్థాయిని కాపాడడమే కాకుండా, సన్నమైన కండరాల యొక్క బరువుని పెంచి దృడంగా ఉంచుతుంది. ముఖ్యంగా యోగా చేసేవారిలో మంచి ఫలితాలు కనపడతాయి.

ప్రతిరోజు త్రిఫల చూర్ణం వాడటం వలన మంచి ఫలితాలను పొందుతారు, మరియు ఇది పూర్తిగా సహజ సిద్దమైనది కావున, ఎలాంటి దుష్ప్రభావాలు కలగవు. త్రిఫల చూర్ణాన్ని పొడిగా కానీ, క్యాప్సూల్ రూపంలో కానీ తీసుకోవచ్చు.

త్రిఫల చూర్ణం ప్రయోజనాలు:
* త్రిఫల చూర్ణం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. యాసీడీటీ సమస్యను తగ్గిస్తుంది.
* టైప్ 2 డయాబెటిస్‌ని కంట్రోల్ చేసే శక్తి ఈ చూర్ణానికి ఉంది.
* ఈ చూర్ణం వల్ల ఆకలి బాగా వేస్తుంది. పెద్ద పేగు శుభ్రపడుతుంది.- కళ్లకు, చర్మానికి, గుండె, లివర్‌కి ఇది ఎంతో మేలు చేస్తుంది.
* సంతాన సామర్థ్యాన్ని ఇది బాగా పెంచుతుంది.
* ముసలితనం త్వరగా రానివ్వదు. జుట్టు బాగా పెరుగుతుంది. జుట్టు తెల్లబడదు.
* ఆస్తమా లాంటి శ్వాస సమస్యలు రావు. ఆల్రెడీ ఉంటే అవి అదుపులో ఉంటాయి.
* జ్ఞాపకశక్తిని బాగా పెంచుతుంది.
* అధికబరువు ఉన్నవారు త్రిఫల చూర్ణం వాడితే మేలు.
* రక్త హీనత ఉన్నవారు ఈ చూర్ణం వాడితే ఎర్రకక్త కణాలు పెరుగుతాయి.
* చర్మ కణాలను కాపాడి, కాన్సర్ రాకుండా అడ్డుకుంటుంది.
* బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కరిగిపోతుంది.

Tags :

Advertisement