Advertisement

  • రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అద్భుతమైన నిమ్మ రసం

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అద్భుతమైన నిమ్మ రసం

By: chandrasekar Mon, 08 June 2020 10:51 AM

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి అద్భుతమైన నిమ్మ రసం


ప్రస్తుత కరోనా సమస్యను ఎదుర్కోవడానికి విటమిన్-సి లభించే ఆహార పదార్థాలు, పండ్లలో రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు అధికంగా వున్న నిమ్మ రసం తీసుకోవడం వల్ల చాలా ఉపయోగకరం. రోగ నిరోధకశక్తిని పెంచుకోవాలని, వ్యక్తిగత పరిశుభ్రత చాలా ముఖ్యమని, చేతుల్ని ఆల్కాహాల్ శానిటైజర్స్‌తో శుభ్రం చేసుకోవాలని వైద్య, ఆరోగ్యశాఖ నిపుణులు సలహా ఇస్తున్నారు.

నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా వుంటుంది. దీనివలన ఆరోగ్య ప్రయోజనాలు అధికం. నిమ్మరసం ఎంతో ప్రాచీనమైన సాంప్రదాయక పానీయంగా భావిస్తారు. అనేకమంది ఆరోగ్య రీత్యా నిమ్మరసాన్ని ప్రతిరోజూ తాగుతారు. నిమ్మ కాయలు మన దేశంలో విరివిగా లభ్యమవుతూంటాయి. నిమ్మరసాన్ని మన దేశ వంటలలో రుచికిగాను విరివిగా వాడుతూంటారు. అంతేకాదు, నిమ్మకాయను ఔషధంగా కూడా కొన్ని అనారోగ్యాలకు ఉపయోగిస్తారు.

కొన్నిరకాల అనారోగ్యాలు నివారించాలన్నా వంటకాలకు అదనపు రుచినివ్వాలన్నా చింతపండుకు ప్రత్యామ్నాయం వాడాలన్నా టక్కున గుర్తొస్తుంది నిమ్మకాయ. విటమిన్‌ 'సి'తో పాటు అదనపు పోషకాలనందించే నిమ్మ మరెన్నో విధాలుగా మేలుచేస్తుంది. నిమ్మకాయను వంటకాలలో రుచికి వాడతారు. నిమ్మరసం కొద్దిగా పిండితే చాలు పదార్ధాల రుచి మారిపోతుంది. ఇక చికెన్, మొదలైన ఆహారాలలో నిమ్మరసం వాడని వారుండరు. నిమ్మరసాన్ని నీటిలో కలిపి ఆరోగ్యకర పానీయంగా తాగుతారు. ప్రత్యేకించి ఉదయంవేళ ఈ నీటిని తాగితే ఆరోగ్యం మెరుగవుతుంది. పాలు లేకుండా టీ తాగేవారు కొద్దిగా నిమ్మరసాన్ని, తేనెను చేర్చి తాగుతారు.

* జీర్ణక్రియ సమస్యలు పరిష్కరించబడుతాయి. అజీర్ణం వలన ఏర్పడే, గుండెమంట, కడుపు ఉబ్బటం, త్రేన్పులు వంటివి రాకుండా వుంటాయి. పురాతన కాలంలో మీ తల్లులు అమ్మమ్మలు జ్వరం వచ్చినా లేక పొట్ట గడబిడ అయినా ఒక్క గ్లాసు నిమ్మరసంతో వాటిని తగ్గించేవారని మీరు వినే వుంటారు.

* నిమ్మరసం చర్మ సంబంధిత సమస్యలను నివారిస్తుంది. దీనిలోని విటమిన్ సి చర్మాన్ని సంరక్షించి చర్మ కాంతిని కలిగిస్తుంది. నిమ్మరసం రోజూ తాగితే, ఆరోగ్యం మెరుగుపరచి వయసు కనపడనివ్వకుండా కూడా చేస్తుంది. చర్మాన్ని శుభ్రపరచడంలో అత్యధిక సామర్థం కలిగిన గుణాలు ఉన్నాయి. నిమ్మరసం ముఖానికి పట్టించడం ద్వారా ఎండకు నల్లబడిన చర్మాన్ని తిరిగి నిగారింపు వచ్చేలా చేస్తుంది.

excellent,lemon,juice,for boosting,immunity ,రోగ, నిరోధక శక్తిని, పెంచుకోవడానికి, అద్భుతమైన, నిమ్మ రసం


* బరువు తగ్గేందుకు ఉదయం వేళ నిమ్మరసంలో తేనె వేసి తాగుతారు. ఆరోగ్య ప్రయోజనాల్లో ఇది ఒక ముఖ్యమైనటువంటిది. కొద్దిగా గోరువెచ్చని నీటిలో నిమ్మరసం, కొన్ని చుక్కల తేనె మిక్స్ చేసి ఉదయాన్ని పరకడుపు తీసుకొన్నట్లైతే శరీరంలో నిల్వ ఉన్న క్యాలరీలను, అధిక ఫ్యాట్ ను బర్న్ చేయడానికి బాగా సహాయపడుతుంది.

* గొంతుకు వచ్చే ఇన్ఫెక్షనలకు నిమ్మ మంచి ఔషధం. దీనిలోని యాంటీ బాక్టీరియల్ గుణాలు గొంతునొప్పి, మంట, మొదలైనవి నివారిస్తాయి. గొంతులో దురద, దగ్గు, బొంగురు పోవడాన్ని ఈ జ్యూస్ అరికడుతుంది. తేనెలో యాంటీబ్యాక్టీరియల్ ప్రొపర్టీస్ కలిగి ఉండటం వల్ల గొంతు సమస్యలు కలిగించే జర్మ్స్ ను చంపేస్తుంది. వేడినీళ్ళు గొంతు శుభ్రం చేయడానికి మ్యూకస్ గ్రంథులు తెరిచుకోవడానికి సహాయంచేస్తుంది.

* గుండె జబ్బుల సమస్యలున్నవారికి నిమ్మ రసం నీరు, దీనిలోని పొటాషియం కారణంగా ఎంతో బాగా పని చేస్తుంది. అధిక రక్తపోటు, కళ్ళు బైర్లు కమ్మటం, వాంతి వికారాలు వంటివి పోగొట్టి మైండ్ కు శరీరానికి విశ్రాంతినిస్తుంది. నిమ్మరసంలో ఉండే బయోఫ్లేవినాయిడ్లు రక్తనాళాలకు బలం చేకూరుస్తాయి. తద్వారా అంతర్గత రక్తవూసావం కాకుండా నివారిస్తాయి. కాబట్టి అధిక రక్తపోటు, గుండెజబ్బులు ఉన్నవాళ్లకు నిమ్మ చాలా మంచిది.

* నిమ్మరసంలో పొటాషియం పుష్కలంగా లభిస్తుంది. పొటాషియం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. ఇది సోడియంతో కలిసి మెదడు, నాడీవ్యవస్థల పనితీరును మెరుగు పరుస్తుంది. రక్తంలో పొటాషియం నిల్వలు తగినన్ని ఉంటే మానసిక ఆందోళ న, ఒత్తిడి, మందకొడితనం, మతిమరపు మన ఛాయలకు కూడా రావు. మెదడు చురుగ్గా పని చేస్తుంది. గుండె పనితీరు మెరుగుపడుతుంది.

excellent,lemon,juice,for boosting,immunity ,రోగ, నిరోధక శక్తిని, పెంచుకోవడానికి, అద్భుతమైన, నిమ్మ రసం


* కిడ్నీలో రాళ్ళు ఏర్పడటం అనేది సాధారణ సమస్యగా మారింది. అందుకు కారణం తక్కుగా నీళ్ళు తాగడం, క్యాల్షియం అధికంగా ఉండటం చేత కూడా కిడ్నీలో రాళ్ళు ఏర్పడుతాయి. అలాగే యూరిన్ ఎక్కువ సేపు పోకుండా అలాగే ఉండటం వల్ల కూడా ఈ సమస్య ఏర్పడుతుంది. కిడ్నీ స్టోన్స్ అంటే ఏమికాదు క్యాల్షియం నిక్షేపాలు నిల్వ ఉంటాయి. వీటిని కిడ్నీస్టోన్స్ అంటాం. కాబట్టి వాటిని కరిగించడానికి ఈ తేనె నిమ్మరసం కాంబినేషన్ జ్యూస్ బాగా పనిచేస్తుంది. చిన్న చిన్న రాళ్ళు ఏర్పడకుండా నిరోధిస్తుంది. శరీరంలో అధిక కాల్షియంను తొలగించడానికి నిమ్మకాయం బాగా పనిచేస్తుంది.

* పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నియంత్రిస్తుంది. శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను సైతం నిమ్మకాయ తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

* కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది. వేసవికాలంలో అయితే అధిక చెమట రావడంతో కాస్త అలసత్వం అనిపిస్తుంది. రోజూ నిమ్మరసం తాగితే వేసవిలో ఎండ బారి నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసంతో బాటు తేనె కలుపుకుని తాగుతారు.

Tags :
|
|

Advertisement