Advertisement

వెయిట్ లాస్ కోసం ఒక టీ తాగితే చాలు

By: chandrasekar Fri, 03 July 2020 11:08 AM

వెయిట్ లాస్ కోసం ఒక టీ తాగితే చాలు


బరువు తగ్గాలనుకునేవారు మొదటగా ఇవాళ్టి నుంచి డైట్, వ్యాయామాలు చేయాలి అని అనుకుంటాం. యోగా మ్యాట్ ఇవన్నీ గుర్తొచ్చి నేనెప్పటికీ బరువు తగ్గలేనా అని నీరసం వస్తుంది. ఇవన్నీ చెయ్యాల్సినవేనని, అందరికీ తెలుసు. వెయిట్ లాస్ అన్న మాట వినబడగానే భయం వేస్తుంది.

వెయిట్ లాస్ కోసం ఒక టీ తాగితే చాలు ఎంత బరువున్నా ఈజీగా తగ్గుతారు. ఈ టీలో వాడేవి వాము, జీలకర్ర. ఇవి కిచెన్ లో ఎప్పుడూ రెడీ గానే, చేతికందేటట్లుగా ఉండేవే. ఇవి రెండూ మన వంటల్లో కంపల్సరీగా వాడుతూనే ఉంటాం. వాము, జీలకర అరుగుదలకి బాగా ఉపయోగ పడతాయని మనకి తెలుసు. మనలో చాలా మందికి గ్యాస్ ఉందేమో అనిపిస్తే కొంచెం ఉప్పు, వాము అరచేతిలో వేసుకుని నలిపి నోట్లో వేసుకుని గ్లాసు మంచినీళ్ళు తాగడం అలవాటే.

పూరీలూ, పకోడీలూ చేసినప్పుడు చిటికెడు వాము అందుకే వేస్తారు. వాము జీర్ణకోశాన్ని శుభ్రపరుస్తుంది. వాము వల్ల మలబద్దక సమస్య కూడా దూరమవుతుంది. జీర్ణక్రియ బాగుంటే బరువు పెరిగే ఛాన్స్ ఉండదు. పైగా వాము మెటబాలిజం ని ఇంప్రూవ్ చేయడమే కాక టాక్సిన్స్ ని బయటికి పంపించడంలో కూడా హెల్ప్ చేస్తుంది.

ఇక జీలకర గురించి వంటకాల్లో తాలింపు/పోపు పెట్టాలంటే జీలకర్ర కంపల్సరీ. అంతే కాక ఎప్పుడైనా హెవీ గా తిన్నం అనిపిస్తే ఆ మర్నాడు జీరా రైస్ చేసుకుంటాం, బాలెన్స్ చేయడం కోసం. అరుగుదలని పెంచడంతో పాటూ జీలకర్ర ఎసిడిటీనీ, మంటని కూడా తగ్గిస్తుంది.

ఇప్పుడు ఈ టీ ఎలా చేయాలంటే ఒక గ్లాసు నీటిలో అర టీస్పూన్ వాము, ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి రెండు గంటల పాటూ అలానే ఉంచండి. రాత్రంతా ఉంచినా సరే. ఆ తరువాత, వాము, జీల కర్ర తో సహా ఈ నీటిని ఐదు నిమిషాలు మరిగించండి. వడకట్టి నాలుగు చుక్కలు నిమ్మ రసం వేసుకుని తాగండి. ఈ బేసిక్ రెసిపీకి మీ టేస్ట్ కి అనుగుణం గా ఇంకేమైనా కలుపుకోవచ్చు. నీటిని మరిగించే ముందు కొద్దిగా అల్లం కానీ, పుదీనా ఆకులు కానీ కలుపుకోవచ్చు. మీకు నిమ్మరసం రుచి నచ్చకపోతే దాని బదులు ఒక టీ స్పూన్ తేనె కలుపుకోవచ్చు. వెయిట్ లాస్ కోసం రోజూ ఈ టీ త్రాగండి.

Tags :
|
|
|

Advertisement