Advertisement

మాంసాహార ప్రియులకు తిప్పలు తప్పవు

By: Dimple Fri, 17 July 2020 1:44 PM

మాంసాహార ప్రియులకు తిప్పలు తప్పవు


కొంతమందికి ముక్కలేనిదే ముద్ద దిగదు. దీన్ని చాలామంది గొప్పగా చెప్పుకుంటారు. అమ్మలక్కలైతే.. ‘‘మా అబ్బాయికి రోజు చికెన్ ఉండాల్సిందే.. లేకపోతే అన్నం ముట్టడు’’ అని ఏదో ఘనకార్యంలా చెప్పుకుంటారు. ‘100% లవ్’ సినిమాలో మహాలక్ష్మిలాగా చాలామందికి చికెన్ పిచ్చి ఉంటుంది. మరికొందరైతే మటన్ మస్ట్‌గా తినాల్సిందే అంటారు. వాస్తవానికి ఇవి రెండూ ఆరోగ్యానికి మంచిదే. ఈ కరోనా సీజన్‌లో ఇవీ మరీ ముఖ్యం. అలాగని అదే పనిగా తినేయకండి. కొత్త సమస్యలు వస్తాయి.

కరోనా సీజన్ నేపథ్యంలో చాలామంది రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం కోసం కిలోల కొద్దీ చికెన్, మటన్‌లు లాగించేస్తున్నారు. వాటికి డిమాండు బాగా పెరగడంతో రేట్లు కూడా ఆకాశాన్ని తాకుతున్నాయి. అయితే, అతి ఎప్పుడూ అనార్థమే అని గుర్తించుకోవాలి. ఈ లాక్‌డౌన్ టైమ్‌లో ఆ వెరైటీ ఈ వెరైటీ అని చాలామంది బాగానే నాన్‌వెజ్ లాగించేశారట. ఇది మంచి విషయమే. కానీ, మింగుడుపడని కొన్ని విషయాలు కూడా మీరు తప్పకుండా తెలుసుకోవాలి. మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే మిస్ కాకుండా చదవండి.పిల్లలు అతిగా చికెన్, మటన్‌లు వంటకాల తిన్నట్లయితే ఎదుగుదలలో సమస్యలు తలెత్తుతాయని లండన్‌లో గ్లాస్గో యూనివర్సిటీ జరిపిన పరిశోధనల్లో తేలింది.

* నాన్ వెజ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో సీరం ఫాస్పేటు స్థాయిలు ఎక్కువై యుక్త వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయట.
* మాంసాహారంలోని ఫాస్పేట్ల వల్ల మూత్రపిండాలు దెబ్బతింటాయి.
* ఆకు కూరలు, కూరగాయల ద్వారా కూడా ప్రొటీన్‌ సమృద్ధిగా లభిస్తోంది. కాబట్టి.. మాంసాహారం తక్కువ తిన్నా ఆరోగ్యానికి ఎలాంటి సమస్య ఉండదు.
* శరీరానికి సమతుల్య ఆహారం అందాలంటే.. మాంసాహారం తక్కువగా వెజ్ ఎక్కువగా తీసుకోవాలి.

శాఖాహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్‌, ఫ్యాట్‌ శాకాహారంలో పుష్కలంగా లభిస్తాయి.
✺ వృద్ధాప్య ఛాయలు రాకుండా ఉండాలంటే.. మాంసాహారానికి వీలైన దూరంగా ఉండటం ఉత్తమం అని సూచిస్తున్నారు.
✺ రోజూ కాకపోయినా వారంలో కనీసం రెండుసార్లు మాంసాహారాన్ని తీసుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉండవచ్చని తెలుపుతున్నారు.
✺ అతిగా మాంసం తినడం వల్ల క్యాన్సర్, కాలేయ సమస్యలు కూడా తలెత్తుతాయని నెదర్లాండ్స్‌లోని ఎరాస్మస్ మెడికల్ సెంటర్ అధ్యయనంలో తేలింది.


Tags :
|
|

Advertisement