Advertisement

  • మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే ..

మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే ..

By: Sankar Tue, 14 July 2020 2:43 PM

మధుమేహం అదుపులో ఉండాలంటే ఈ ఆహారానికి దూరంగా ఉండాల్సిందే ..



ప్రస్తుతం చాల మందిని వేధిస్తున్న అతి తీవ్రమైన ఆరోగ్య సమస్య మధుమేహం ..భారతదేశంలో ప్రతి నలుగురిలో ఒకరికి ఈ వ్యాధి ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే దీన్ని పూర్తిగా నివారించే మందు మనకు అందుబాటులోకి రాలేదు. కానీ సరైన ఆహార నియమావళి పాటిస్తే షుగర్‌ను నియంత్రించవచ్చు. షుగర్‌తో బాధపడుతున్న వారు కొన్ని ఆహారపదార్థాలు అస్సలు తీసుకోకపోతే మంచిదని నిపుణులు చెబుతున్నారు.

1. సాధారణంగా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టపడే ఆహారం వైట్ బ్రెడ్. ధర కూడా తక్కువే. కానీ వైట్ బ్రెడ్‌లో చక్కెర శాతం, కార్బోహైడ్రేడ్లు అధికం. ఇవి మన శరీరంలో షుగర్ లెవెల్స్‌ని అమాంతం పెంచేస్తాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు దీన్ని పక్కన పెడితే మంచిది.

2. హోల్ మిల్కులో కొవ్వు శాతం అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో కొలస్ట్రాలను మరింత పెంచేస్తుంది. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు హోల్ మిల్క్‌తో పాటు పాలకోవ, మైసూర్‌పాక్ వంటి డైరీ ఫుడ్స్‌కి దూరంగా ఉండాలి.

3. మనం సాధారణంగా తెల్ల అన్నం ఎక్కువగా తింటాం. దీనిలో కార్బోహైడ్రేడ్లు, ఫైబర్లు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ ఉన్నవాళ్లు వైట్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్ తింటే మంచిది.

4. సాధారణంగా చాలా మంది బంగాళా దుంపలు తినడానికి ఇష్టపడరు. వాతంచేసే గుణం దీనిలో ఉంటుందని అంటారు. అయితే షుగర్ లెవెల్స్‌ను పెంచేసే గుణం కూడా బంగాళాదుంపలకు ఉంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి.


diabetic,patients,avoid,white rice,mutton,alu,fruit juice ,మధుమేహం , అదుపులో,  ఉండాలంటే , ఈ ఆహారానికి దూరంగా , ఉండాల్సిందే



5. పండ్ల రసాలను ఎక్కువగా తీసుకునేవారిలో సగటున 18 శాతం మంది డయాబిటిస్ బారిన పడుతున్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి. కాబట్టి షుగర్ ఉన్నవాళ్లు పండ్ల రసాలకు దూరంగా ఉండాలి.

6. మల్టీప్లెక్సులు, రెస్టారెంట్లకు వెళ్లినప్పుడు చాలా మంది ఇష్టపడే ఫుడ్ ఫ్రెంచ్ ఫ్రైస్. బంగాళాదుంపలతో చేసే ఫ్రెంచ్ ఫ్రైస్ తయారీలో వాడే పదార్థాలు షుగర్ పేషెంట్లకు మంచిదికాదు.

7. మేక, గొర్రె మాంసాలకు షుగర్ పేషెంట్లు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. మటన్‌కి బదులు చికెన్, బీఫ్, చేపలు తినొచ్చని నిపుణులు సలహా ఇస్తున్నారు.

8. డాక్టర్ చక్కెర తినొద్దన్నారు కదా అని చాలా మంది షుగర్ పేషెంట్లు కృత్రిమంగా తయారుచేసిన తీపి పదార్థాలను తింటారు. కానీ ఇవి కూడా మంచివి కావని నిపుణులు చెబుతున్నారు.


Tags :
|
|
|

Advertisement