Advertisement

ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే జీలకర్ర

By: chandrasekar Thu, 03 Sept 2020 09:28 AM

ఆరోగ్యానికి ఎంతో మేలుచేసే జీలకర్ర


వంట గదిలో జీలకర్ర లేనిదే ఏ వంటలు తాయారు కావు. మన దేశ వంటకాలలో ప్రధానంగా వాడబడే దీని వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు కలుగుతుంది. భారతీయ వంటకాలలో జీలకర్ర ఎంత ప్రధానమో అందరికీ తెలిసిందే. తెలుగువారి పోపుల పెట్టె జీలకర్ర లేనిదే పూర్తి అవదు. కిచెన్ లో దాని ప్రాధాన్యత అలాంటిది. అందుకే మన పూర్వికులు జీలకర్రను పోపు దినుసుల్లో ప్రధానమైన పదార్ధం అని తెలిపారు. ఇందులో ఉండే యాంటి ఇంఫ్లామేటరీ, యాంటీ ఆక్సిండెంట్ అంశాలు ఆరోగ్యాన్ని కాపాడుతాయి. దాంతో పాటు మెరిసే చర్మం సొంతం అవుతుంది. రక్తం శుద్ధి జరుగుతుంది. జీర్ణ క్రియ సాఫీగా జరుగుతుంది.

జీలకర్రను పొడి చేసి అందులో నిమ్మరసం పిండి కలుపుకొని నీడలో బాగా ఆరబెట్టాలి. బాగా ఆరిన తరువాత ఒక గాజు సీసాలో భద్రపరచి రోజు కొంచం నోటిలో వేసి నమలడం ద్వారా జీర్ణక్రియ అవరోధాలు లేకుండా ఉంటుంది. జీలకర్ర కాషాయం పెట్టి అజీర్తి సమయంలో తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. జీలకర్రల్లో యాంటీయాక్సిడెంట్ శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల ముఖంపై మడతలు రావడం, డార్క్ సర్కిల్స్ రావడం తగ్గుతాయి. దాంతో పాటు చర్మం కాంతివంతం అవుతుంది.

విరేచనాల సమయంలో జీలకర్ర కాస్త నీటిలో వేసి దానిని బాగా మరిగించాలి. ఇలా మరిగించిన నీరు సగం అయ్యే వరకు వేడి చేసిన తరువాత దానిని దించి కొంచం ఉప్పు వేసి గోరు వెచ్చగా తాగితే విరేచనాలను అదుపు చేస్తుంది. రాత్రి పూట కొన్ని నీళ్లల్లో జీలకర్ర నానపెట్టి వాటితో పొద్దున్నే ముఖం కడిగిగే ముఖం మెరుస్తుంది. నీటిలో జీలకర్ర వేసి ముఖానికి ఆవిరి పట్టడం వల్ల ముఖంపై ఉన్న మలినాలు తొలగిపోతాయి. ముఖంపై ఉన్న నల్లమచ్చలు కూడా తొలగిపోతాయి. చర్మంలో రక్తప్రసరణను పెంచుతుంది. ఈ చిట్కాలు మీ జీవితంలో భాగం చేసుకుని ఆరోగ్యంతో పాటు అందం సొంతం చేసుకోండి. వేడి నీటిలో జీలకర్ర వేసి వేడిచేసి ఆ నీటిని రోజంతా తాగితే జీర్ణక్రియ బాగా పనిచేస్తుంది.

Tags :
|

Advertisement