Advertisement

  • చిన్న పిల్లలకి కరోనా వ్యాక్సిన్ తయారీ ఎప్పుడో మరీ...?

చిన్న పిల్లలకి కరోనా వ్యాక్సిన్ తయారీ ఎప్పుడో మరీ...?

By: Anji Fri, 18 Dec 2020 09:30 AM

చిన్న పిల్లలకి కరోనా వ్యాక్సిన్ తయారీ ఎప్పుడో మరీ...?

కరోనా మహమ్మారి నుండి చిన్నా పిల్లలను కాపాడడానికి కరోనా వ్యాక్సిన్ తయారీకి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని అంటున్నారు శాస్త్రవేత్తలు.

కాగా, 12 సంవత్సరాల లోపు చిన్నారుల విషయనికి వస్తే ఈ ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లలలో ఇమ్మునిటీ పవర్ అనేది ఎక్కువగా ఉన్న కూడా కరోనా వ్యాక్సిన్ మరింత ఆలస్యం అయ్యేటట్లు కనిపిస్తోంది. ఈ చిన్నారుల్లో అక్టోబర్‌ నుండి వ్యాక్సిన్‌ పరీక్షలు మొదలుపెట్టారు.

ఫలితం వచ్చేందుకు చాలా కాలం పట్టే అవకాశం కూడా ఉంది. కాబట్టి...ఈ వయస్సు చిన్నారుల్లో అత్యవసర వినియోగానికి అనుమతిన్విడమన్నదీ ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్ట్రేషన్‌ నిర్ణయించాల్సి ఉంది.

అమెరికాలో అందుబాటులోకి రానున్న మరో వ్యాక్సిన్‌ మోడర్నా. ఇప్పుడు 12 నుండి 17 ఏళ్ల లోపు చిన్నారులపై ప్రయోగాలకు నమోదు ప్రక్రియను ప్రారంభించింది. వారిని ఒక సంవత్సరం పాటు పరిశీలనలో ఉంచుతుంది.

12 ఏళ్ల లోపు వయస్సు ఉన్నవారిపై 2021 నుండి పరీక్షలు చేపట్టనుంది. వచ్చే విద్యా సంవత్సరానికి ఖచ్చితమైన ఫలితాలు వస్తాయో రావోనన్న అనిశ్చితి నెలకొంది.


కాగా, వృద్ధులపై చేపట్టిన వ్యాక్సిన్‌ ప్రయోగం సానుకూల ఫలితాలు వస్తున్నట్లు పలు అధ్యయనాలు చెబుతున్నాయి. దీంతో చిన్నారులకు అందించవచ్చునని వాండర్‌ బిల్డ్‌ యూనివర్శిటీ చిన్నపిల్లల అంటు వ్యాధి నిపుణుడు డా. బుడ్డీ క్రీచ్‌ తెలిపారు.

కాగా, ఈ వైరస్‌ ఇప్పటి వరకు అత్యధికంగా చిన్నారులకు సోకకపోయినా, వీరి నుండి కరోనా ఇతరులకు సోకే అవకాశముందని...సిన్సినాటి చిల్డ్రన్‌ హాస్పిటల్‌ లో చిన్నారులపై ఫైజర్‌ వ్యాక్సిన్‌ ప్రయోగానికి నేతృత్వం వహిస్తున్న డా. రోబర్ట్‌ ఫ్రీంక్‌ తెలిపారు.

సుమారు 1.6 మిలియన్ల మంది పిల్లలు కరోనా బారిన పడ్డారని, 8వేల మంది ఆసుపత్రి పాలయ్యారని, 162 మంది చనిపోయారని తెలిపారు.

Tags :

Advertisement