Advertisement

  • షాకింగ్‌.. కరోనా లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం

షాకింగ్‌.. కరోనా లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం

By: Anji Mon, 21 Sept 2020 10:13 AM

షాకింగ్‌.. కరోనా లక్షణాలు లేని వారిలోనే వైరస్ లోడు అధికం

లక్షణాలు ఉన్న వారి కంటే లేని వారిలోనే వైరస్ లోడు ఎక్కువగా ఉన్నట్లు హైదరాబాద్‌లోని సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్ ప్రింట్ సర్వేలో తేలింది. అంతేకాదు 95 శాతం మందిలో 20 బి క్లేడ్ స్ట్రెయిట్ రకం వైరస్ ఉన్నట్లు ఆ సర్వేలో వెల్లడైంది. మే, జూన్ నెలల్లో గ్రేటర్ హైదరాబాద్ సహా శివారు ప్రాంతాల్లో కరోనా బారిన పడిన 210 మంది డేటాను వారు విశ్లేషించారు. వారిలో వైరస్ లోడుకు తోడు, ఇమ్యూనిటీ లెవల్స్ కూడా ఉండటం వలన ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నారని ఆ సర్వేలో తేలింది.

వీరి నుంచి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్న వారికి వైరస్ వ్యాపిస్తోందని, దీంతో వారు మృత్యువాతకు గురవుతున్నారని ఈ సర్వేలో పాల్గొన్న వారు తెలిపారు.వైరస్‌లోడుకు తోడు...అదేస్థాయిలో ఇమ్యునిటీ లెవ ల్స్‌ ఉండటం వల్లే వారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు బయటికి కనిపిస్తున్నట్లు స్పష్టం చేసింది. వీరి నుంచి ఇమ్యునిటీ లెవల్స్‌ తక్కువగా ఉన్న వారికి వైరస్‌ వ్యాపించి, వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు గుర్తించింది.
70 శాతం మందిలో ఏ లక్షణాలు లేవు..

జీహెచ్‌ఎంసీ పరిధిలో ఇప్పటి వరకు 57 వేల మంది వైరస్‌ బారిన పడ్డారు. వీరిలో 70 శాతం మందిలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదు. కేవలం 30 శాతం మందిలోనే జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కన్పించాయి. కోవిడ్‌ లక్షణాలు ఉన్న వారితో పోలిస్తే...ఏ లక్షణాలు లేని అసింప్టమాటిక్‌ బాధితుల్లోనే వైరస్‌ లోడు ఎక్కువగా ఉన్నట్లు సెంటర్‌ ఫర్‌ డీఎన్‌ఏ ఫింగర్‌ ప్రింట్స్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరి నుంచి వృద్ధులు, పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వైరస్‌ విస్తరించి, పరోక్షంగా వారి మృత్యువాతకు కారణమవుతున్నట్లు తేలింది. ఈ పరిశోధన వివరాలు ‘బయో ఆరెక్సీవ్‌’ అనే ప్రీప్రింట్‌ రీపాజిటరీలో ఇటీవల పబ్లిష్‌ కావడం గమనార్హం.


ఐదు శాతం మందిలోనే ఇతర వైరస్‌:

నగరంలోని కోవిడ్‌ బాధితుల నుంచి సేకరించిన నమూనాల్లోని జీనోమ్‌ సీక్వెన్స్‌ డేటాను పరీక్షించగా, వైరస్‌ జీనోమ్‌లో ఎక్కువ మ్యుటేషన్లు జరిగినట్లు గుర్తించారు. 95 శాతం మందిలో 20 బిక్లేడ్‌ అనే స్ట్రెయిన్‌కు చెందిన కరోనా వైరస్‌ ఉన్నట్లు నిర్ధారించారు. కేవలం ఐదు శాతం మందిలో మాత్రమే ఇతర స్ట్రెయిన్‌లకు చెందిన వైరస్‌ ఉన్నట్లు తేలింది. మొదట్లో రెండు మూడు రకాల వైరస్‌ నిర్ధారణ అయినప్పటికీ..మే జూన్‌ మాసాల్లో అత్యధికంగా ఈ బిక్లేడ్‌ స్ట్రేయిన్‌కు చెందిన వైరస్సే ఉన్నట్లు గుర్తించడం విశేషం.

Tags :

Advertisement