Advertisement

  • ఏపీ ప్రజలకు శుభవార్త... ఈ నెల 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ...!

ఏపీ ప్రజలకు శుభవార్త... ఈ నెల 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ...!

By: Anji Wed, 16 Dec 2020 1:06 PM

ఏపీ ప్రజలకు శుభవార్త... ఈ నెల 25 నుంచి కరోనా వ్యాక్సిన్ పంపిణీ...!

ఏపీ ప్రజలను వణికిస్తున్న కరోనా మహమ్మారి నుండి ప్రజలను కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. డిసెంబరు 25 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కోటి మందికి కరోనా వ్యాక్సిన్లు ఇచ్చే బృహత్ కార్యక్రమం ప్రారంభం కానుంది.

ఏపీ సీఎం జగన్ ఆదేశాల మేరకు 4,762 ఆరోగ్య కేంద్రాల్లో వాక్సినేషన్ జరగనుంది. దీనికోసం ఇప్పటికే వ్యాక్సిన్ ఇచ్చే సిబ్బందికి ట్రైనింగ్ ఇస్తున్నారు.

అలాగే... వ్యాక్సిన్ల పంపిణీ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. అయితే రాష్ట్రంలోని ప్రజలకు ఏ వ్యాక్సిన్ ఇస్తారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

ఇది ఇలా ఉండగా మనదేశంలో త్వరలోనే వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియను ప్రారంభించనున్నట్లు కొద్దిరోజుల క్రితం ప్రధాని మోదీ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే దీనిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.

ఇది ఇలా ఉండగా ఏపీలో నిన్న కొత్తగా 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 8,76,336కి చేరాయి. మరోపక్క 5గురు కరోనాతో మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 7,064కి చేరింది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,09,37,377 మందికి కరోనా పరీక్షలు చేశారు. నిన్న కొత్తగా 61,452 మందికి టెస్టులు చేశారు. ప్రస్తుతం ఏపీలో 4,660 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

Tags :

Advertisement