Advertisement

  • ఇమ్మ్యూనిటి పవర్ పెంచుటకు ఎంతగానో ఉపయోగపడే కొబ్బరి

ఇమ్మ్యూనిటి పవర్ పెంచుటకు ఎంతగానో ఉపయోగపడే కొబ్బరి

By: chandrasekar Thu, 03 Sept 2020 09:47 AM

ఇమ్మ్యూనిటి పవర్ పెంచుటకు ఎంతగానో ఉపయోగపడే కొబ్బరి

మనిషి ఇమ్మ్యూనిటి పవర్ పెంచుటకు కొబ్బరి ఎంతగానో ఉపయోగపడుతుంది. ప్రకృతి మనకు ఇచ్చిన గొప్ప బహుమతి కొబ్బరి. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కొబ్బరికాయలు భారతదేశంలో ప్రత్యేక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. ఇది అనేక ఆరోగ్య ప్రయోజనాలకు మాత్రమే పరిమితం కాకుడా పవిత్రత, ఆధ్యాత్మిక అనుసంధానానికి కూడా ఉపయోగపడుతుంది. ప్రపంచ కొబ్బరి దినోత్సవాన్ని ప్రతి ఏటా సెప్టెంబర్ 2న జరుపుకుంటారు.

కేరళలో కొబ్బరి పంటకు ప్రసిద్ధి స్థలం. ఈ ఏడాది ప్రపంచ కొబ్బరి దినోత్సవం లక్ష్యం పెట్టుబడులు, ఏపీసీసీ సభ్య దేశాల్లో కొబ్బరి పరిశ్రమ అభివృద్ధిని ప్రోత్సహించడం. ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా ప్రతిఒక్కరూ దీని ప్రయోజనాలను తెలుసుకోవాలి. దీంతో ప్రధానంగా ఐదురకాల ఉపయోగాలున్నాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఈ కరోనా సమయంలో కొబ్బరిని విరివిగా వాడితే రోగనిరోధక శక్తి పెరుగుతుందని సూచిస్తున్నారు. ఇమ్యూనిటీ పెంచుతుంది కొబ్బరి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ప్రతిరోజూ కొన్ని కొబ్బరి ముక్కలు తినడం లేదా కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఇమ్యూనిటీ పవర్‌ పెరుగుతుంది. దీంతో కరోనాతోపాటు ఇతర వ్యాధులనుంచి రక్షణ పొందవచ్చు. రక్తంలో చక్కెరస్థాయిని నియంత్రిస్తుంది కొబ్బరి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. మధుమేహులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.

కొబ్బరిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది రక్తంలోకి చక్కెర విడుదలను మందగించడానికి సహాయపడుతుంది. జుట్టుకు పోషణనిస్తుంది. కొబ్బరి నూనె జుట్టుకు పోషణనిస్తుంది. అందుకే దీనిని హెయిర్‌ ఆయిల్‌గా విస్తృతంగా వాడుతారు. కొబ్బరి నూనె పొడి, కఠినమైన జుట్టు, చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను పరిష్కరించడంలో సహాయపడుతుంది.చర్మరక్షణకు తోడ్పడుతుండి.

అనేక పరిశోధనలలో ఏర్పడిన ఫలితాల ఆధారంగా కొబ్బరి చర్మరక్షణకు ఎంతగానో తోడ్పడుతుంది. చర్మ సమస్యలకు ఇంట్లో పెద్దవారు కొబ్బరినూనెనే ఎక్కువగా వాడుతారు. దోమ కాటుకు గురైనప్పుడు, ఇతర గాయాలు తగినప్పుడు ఇంట్లో మొదట కొబ్బరి నూనెనే రాస్తారు. ఇది చర్మంపై గీతలు, గడ్డలు, మచ్చలు, గాయాలను మాన్పేందుకు ఉపయోగపడుతుంది. కొబ్బరి నూనె వివిధ వంటకాలలో కూడా ఎక్కువగా వాడుతారు. ఇది ఎంతగానో ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

వివిధ రకాలైన వంటలలో పచ్చి కొబ్బరిని ఎక్కువగా ఉపయోగిస్తారు. చాలా కూరల్లో దీన్ని తురిమి వేస్తుంటారు. ఇది కూరకు అదనపు రుచిని తీసుకొస్తుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతోపాటు పోషకాలుంటాయి. కనుక ప్రతిఒక్కరూ తప్పక తినాల్సిన పదార్థం. దీనిని కూరలతోపాటు స్వీట్లలోనూ ఉపయోగిస్తారు. నోటిలో మరియు కడుపులో ఏర్పడ్డ అల్సర్ లకు కొబ్బరి పాలు ఎంతో మేలు చేస్తుంది.

Tags :

Advertisement