Advertisement

‘బాయ్‌కాట్ చైనా’ నినాదం జోరుగా నిపిస్తోంది

By: chandrasekar Sat, 20 June 2020 10:05 AM

‘బాయ్‌కాట్ చైనా’ నినాదం జోరుగా నిపిస్తోంది


లద్ధాఖ్‌లోని గాల్వన్ లోయలో మన దేశానికి చెందిన 20 మంది సైనికులను చైనా సేనలు బలతీసుకోవడం పట్ల దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. చైనాకు దానికి అర్థమయ్యే భాషలోనే ధీటుగా సమాధానం ఇవ్వాలన్న డిమాండ్‌తో పాటు ‘బాయ్‌కాట్ చైనా’ నినాదం జోరుగా వినిపిస్తోంది. చైనాను ఆర్థికంగా చావు దెబ్బతీసేందుకు ఆ దేశ ఉత్పత్తులను పూర్తిగా బహిష్కరించాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

డ్రాగన్ వెన్నువిరిచేలా ఈ దిశగా కేంద్రం కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా చైనా ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూత్రప్రాయ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పలు శాఖల మంత్రులు, అధికారులతో విడతలవారీగా చర్చలు జరిపినట్లు అధికార వర్గాలు ‘సీఎన్‌బీసీ-టీవీ9’కి ధృవీకరిస్తున్నాయి. మరికొన్ని సంప్రదింపుల తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సదరు ప్రతిపాదనలను ప్రధాని నరేంద్ర మోదీ ముందుంచనున్నారు. ఆ తర్వాత ఈ విషయంలో తుది నిర్ణయానికి రానున్నారు.

అటు వాణిజ్య మంత్రిత్వ శాఖ, భారీ పరిశ్రమల మంత్రిత్వ శాఖ, ఫార్మాసీటికల్స్ డిపార్ట్‌మెంట్, మధ్య, చిన్నతరహా పరిశ్రమల శాఖ, విద్యుత్, పునరుత్పాధక ఎనర్జీ మంత్రిత్వ శాఖల మంత్రులు, అధికారుల మధ్య విస్తృత చర్యల జరుపుతున్నట్లు తెలుస్తోంది. ఆయా విభాగాల్లో చైనా ఉత్పత్తుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించాలని భావిస్తున్నారు.

దాదాపు 300 రకాల చైనా ఉత్పత్తులపై కస్టమ్స్, దిగుమతి సుంకాలను పెంచాలని భావిస్తున్నట్లు సమాచారం. అదే సమయంలో కోవిడ్-19 సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే గాడిన పడుతున్న దేశ పారిశ్రామిక రంగానికి చైనా ఉత్పత్తుల అవసరం ఎంతో ఉంది. వీటిపై దిగుమతి సుంకాలను పెంచడం ద్వారా దాని ప్రభావం దేశ పారిశ్రామిక రంగంపై ఏ మేరకు ఉండొచ్చన్న అంశాన్ని కూడా బేరిజు వేసుకుంటున్నారు.

కొన్ని ఉత్పత్తులపై దిగుమతి సుంకాలను పెంచితే ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి కూడా విఘాతం కలగొచ్చని కొందరి పారిశ్రామిక నిపుణులు హెచ్చరిస్తున్నట్లు వినికిడి.

Tags :
|
|
|

Advertisement