Advertisement

లిచీ పండ్ల‌ను తినే విషయంలో జాగ్రత్తలు

By: chandrasekar Fri, 26 June 2020 7:30 PM

లిచీ పండ్ల‌ను తినే విషయంలో జాగ్రత్తలు


చూడగానే నోరూరించే లిచీ పండ్ల‌ను తెలియని వారు వుండరు. ఏదై‌నా మోతాదుకు మించితే విషం క‌న్నా డేంజ‌ర్‌. అలాగే స్ట్రాబెర్రీ పండ్ల‌లా అనిపించిఏ లిచీ పండ్ల‌ను చూస్తే నోరూరిపోతుంది. వీటిని తిన‌కుండా కంట్రోల్ చేసుకోవ‌డం కాస్త క‌ష్ట‌మే. అలా అని ఎప్పుడు ప‌డితే అప్పుడు తింటే పెద్ద ముప్పే అంటున్నారు. లిచీ పండ్ల‌ను కొన్ని స‌మ‌యాల్లో తిన‌డం వ‌ల్ల కొన్ని స‌మ‌స్య‌లు కోరి తెచ్చుకుంటార‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. లిచీ పండ్లు తిన‌డం వ‌ల్ల ప్ర‌యోజ‌నాలేంటి? అన‌ర్థాలు ఏమిటో? చూద్దాం.
* ఇందులో ఉండే ఎక్యూట్ ఎన్‌సెఫ‌లైటిస్ సిండ్రోమ్ వ‌ల్ల మెద‌డువాపుకు దారితీస్తుంది. ఈ పండులో ఉండే విష‌ప‌దార్థం వ‌ల్ల ఈ వ్యాధి సోకుతుంది. అంతేకాదు ఉష్ణోగ్ర‌త వ‌ల్ల కూడా లిచీ పండ్లు విష‌తుల్యం అవుతాయి.

* లిచీ పండ్లలో ఉండే ‘హైపో‌గ్లైసెమిక్ ఎన్‌సెఫాలోపతీ’ వల్ల రక్తంలో చక్కెర శాతం ప్రమాద స్థాయికి పడిపోతుంది.

* అన్నీ పండ్ల‌తో పోలిస్తే లిచీలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని ఖాళీ క‌డుపుతో అస‌లు తిన‌కూడ‌దు. అందులో ప‌చ్చిగా ఉన్న‌పండ్ల‌ను అస‌లు ముట్టుకోవ‌ద్దు అంటున్నారు. ఇటీవ‌ల మార్కెట్లో దొరికే లిచీ పండ్ల‌ను ఎర్ర‌ని రంగు వేసి అమ్ముతున్నారు. వీటిని తిన‌డం వ‌ల్ల ప్రాణాలు పోయే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. చిన్నపిల్ల‌ల్ని వీటి జోలికి పోనీకుండా చూసుకోవాలి. గర్భంతో ఉండే మహిళలు ఈ పండ్లను తినకపోవడమే మంచిది.

beware,of eating,lichi,fruit,tasty ,లిచీ, పండ్ల‌ను, తినే, విషయంలో, జాగ్రత్తలు


లిచీపండ్లు తిన‌డం వ‌ల్ల అల‌ర్జీలు, మ‌రే ఇత‌ర స‌మ‌స్య‌లు ఉన్నా ఆల‌స్యం చేయ‌కుండా వైద్యుడిని సంప్ర‌దించాలి.

లిచీపండ్లు తక్కువగా తింటే చాలా లాభాలు

* ఆస్తమా, ఉబ్బసం వంటి దీర్ఘకాలిక వ్యాధుల నివారణకూ లిచీ మంచిదే.
* లిచి పండ్లను తింటే బరువు కూడా తగ్గుతారు.
* రోగ నిరోధక శక్తిని పెంచే గుణాలు కూడా లిచీలో ఉన్నాయి
* జీర్ణ సమస్యలను తీర్చడంలోనూ లిచీ బాగా పనిచేస్తుంది.
* గుండెను ఆరోగ్యం ఉంచేందుకు అవసరమైన పాలిపినాల్స్ లిచీలో అధికంగా ఉన్నాయి.
* పాలిపినాల్స్ క్యాన్సర్ వంటి వ్యాధులను కూడా అరికడతాయి.
* శరీరంలోని బాక్టీరియాలు, వైరస్‌లను నానశనం చేస్తుంది.

Tags :
|
|
|

Advertisement