Advertisement

  • ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో ఈ చిట్కాలతో ఒత్తిడిని దూరం చేసుకోండి..

ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో ఈ చిట్కాలతో ఒత్తిడిని దూరం చేసుకోండి..

By: Sankar Thu, 27 Aug 2020 10:53 AM

ఉరుకుల పరుగుల బిజీ లైఫ్ లో ఈ చిట్కాలతో ఒత్తిడిని దూరం చేసుకోండి..


రోజూ ఉరుకుల పరుగుల జీవితం. నిత్యం ఎన్నో సవాళ్లు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. దీంతో ఒత్తిడికి లోనవుతుంటాము. కొంతమంది ప్రతీ చిన్న విషయానికి మానసిక ఒత్తిడికి గురవుతారు. ఇది పలు సందర్భాలలో జరుగుతుంది. మ‌న శ‌రీరంలోని హార్మోనులు సాధార‌ణ‌మైన వేగంతో కాకుండా ఎక్కువ వేగంగా ప‌నిచేయ‌డం వ‌ల్ల ఒత్తిడి పెరుగుతుంది. ఈ ఒత్తిడి నిరంత‌ర ప్ర‌క్రియ‌లా మారితే అది శ‌రీరానికి, మాన‌సిక సామ‌ర్థ్యానికి కూడా హానిచేస్తుంది. అయితే ఒత్తిడి త‌గ్గించుకోవ‌డ‌మ‌నేది మ‌న‌చేతిలోనే ఉంది. అందుకోసం కొన్ని చిట్కాల‌ను చూద్దాం.

1. మంచినీరు ఎక్కువ‌గా తీసుకోవాలి. కనీసం 2 లీటర్ల వరకు నీటిని రోజులో అప్పుడప్పుడైనా తాగితే అది శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుతుంది.

2. కాఫీ, టీలు త‌గ్గించాలి. పాల‌లోగానీ, నిమ్మ‌ర‌సంలో గానీ తేనెను క‌లుపుకుని తాగితే చాలా ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

3. త‌గినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి.

4. చిన్న చిన్న రిలాక్సేష‌న్ టెక్నిక్స్, యోగ‌, శ్వాసకు సంబంధించిన వ్యాయామాలు, పాజిటివ్‌గా ఆలోచించ‌డం ఒత్తిడిని జ‌యించ‌డానికి చాలా ఉప‌క‌రిస్తాయి.

5. నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్‌సైజ్‌లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది.

6. ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి.

7. నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేయాలి.

Tags :
|
|

Advertisement