Advertisement

దగ్గును తగ్గించే అద్భుత చిట్కాలు

By: Sankar Tue, 08 Sept 2020 4:58 PM

దగ్గును తగ్గించే అద్భుత చిట్కాలు


అసలే ఇది కరోనా కాలం ..ఎంతో జాగ్రత్తగా ఉండాల్సిన సమయం..దీనికి తోడు వర్షాకాలం కూడా తోడవడంతో వ్యాధులు అత్యంత తొందరగా వ్యాపిస్తాయి..కరోనా కు , మాములు ఫ్లూ కు ఒకే లక్షణాలు ఉండటంతో ఏది కరోనా , ఏది సాధారణ ఫ్లూ అనేది అర్థంకావడం లేదు..అందుకే వ్యాధులు రాకుండా చాల జాగ్రత్తలు తీసుకోవాలి ..ముఖ్యంగా దగ్గు..కరోనా అతి ముఖ్య లక్షణాలలో దగ్గు ఒకటి కావడంతో దగ్గు తగ్గాలంటే ఏ చిట్కాలు పాటించాలో తెలుసుకుందాం..

1. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలుపుకుని తాగితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. లేదా హెర్బల్‌ టీలో తేనె కలుపుకుని తాగినా దగ్గును తగ్గించుకోవచ్చు.

2. పైనాపిల్‌ పండ్లలో ఉండే బ్రొమెలెన్‌ దగ్గును త్వరగా తగ్గిస్తుంది. పైనాపిల్‌ పండ్లను తినడం ద్వారా దగ్గును త్వరగా తగ్గించుకోవచ్చు.

3. ఒక పాత్రలో కొద్దిగా నీటిని తీసుకుని అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి మరిగించాలి. ఆ తరువాత వచ్చే మిశ్రమాన్ని తాగితే దగ్గు తగ్గుతుంది.

4. ఒక గ్లాస్‌ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా అల్లం రసం, నిమ్మరసం కలుపుకుని తాగితే దగ్గు తగ్గుతుంది.

5. లవంగాలు, దాల్చినచెక్క, అల్లం రసం, మిరియాలు కలిపి వేసి తయారు చేసిన మసాలా టీని తాగడం వల్ల కూడా దగ్గు నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు.

Tags :
|
|
|

Advertisement