Advertisement

అవిసె గింజల వల్ల కలిగే ప్రయోజనాలు

By: chandrasekar Mon, 31 Aug 2020 10:40 AM

అవిసె గింజల వల్ల కలిగే ప్రయోజనాలు


అవిసె గింజల తరచు తీసికోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవిసె గింజలు రుచి మరియు వాసనలను అనేక మంది ఇష్టపడతారు. వీటిని అందరూ ఇష్టపడటానికి మరో కారణం వాటి పోషక విలువలు. ఇవి అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. అవిసె గింజల యొక్క మూడు ముఖ్యమైన పోషక అంశాలు ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు, లిగ్నన్స్ మరియు మ్యుసిలేజ్. ఇవే కాకుండా అవిసె గింజలో విటమిన్ బి1, ప్రొటీన్స్, కాపర్, మాంగనీస్, మెగ్నీషియం, భాస్వరం, జింక్ మరియు సెలీనియంతో పాటు కరిగే మరియు కరగని పీచు పదార్ధాలను కలిగి ఉంటుంది. పూర్వం అవిసె గింజలను చట్నీల రూపంలో కూడా తీసికొనేవారు.

అవిసె గింజలు యొక్కఆరోగ్య ప్రయోజనాలు

చేపలు తినని వారు అవిసె గింజలు తీసుకోవడం వల్ల ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలను ఇందులోనుండి పొందవచ్చును. అవిసె గింజలు మేలురకం కొవ్వులకీ, ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలకు పెట్టింది పేరు. వీటిని తినడం వల్ల స్త్రీ హార్మోన్ అయిన ఈస్ట్రోజన్ లోపం లేకుండా ఉంటుంది. దీనిలోని అల్ఫాలినోలెనిక్ అనే పోషకం కండరాలకు బలాన్ని ఇస్తుంది.

* గుండె కేలిగే మేలు

పరిశోధనల ద్వారా అవిసె గింజలలో ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు ఉంటాయని తెలిసాయి. అందువల్ల తరచుగా వీటిని తీసుకోవడం వల్ల హృదయ స్పందన సమతుల్యం అవుతుందని వెల్లడైంది. అవిసె గింజల్లోని లిగ్నన్స్ కూడా గుండె ఆరోగ్యానికి చాలా ఉపయోగకరం.

* కొలెస్ట్రాల్ తగ్గుటకు

జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ అండ్ మెటబాలిజం లో ప్రచురించిన ఒక అధ్యయనంలో ఆహారంలో అవిసెగింజల్ని జోడించడంవలన సహజంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుందని కనుగొన్నారు. ఇది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది మరియు మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది.

* రక్తపోటు లేదా బిపిని అదుపు చేయుటకు

అధిక రక్తపోటు (హై బిపి) తగ్గించడానికి ఈ అవిసె గింజలు ఎంతో ఉపయోగపడతాయి. కెనడా పరిశోధనలో ప్రతీరోజూ 30 గ్రాముల అవిసెగింజలను తీసుకోవడం వల్ల 17% రక్తపోటు తగ్గుతుందని తేలింది.

benefits,flax,seeds ,అవిసె , గింజల , వల్ల , కలిగే,  ప్రయోజనాలు


* బరువు తగ్గుటకు

అవిసె గింజలు బరువు తగ్గడానికి సహాయపడతాయి. వీటిలోని కరిగే పీచుపదార్థం ఆకలి మరియు తినాలనే కోరికను అణచివేయడానికి సహాయపడుతుంది. అవిసె గింజలలో గల పీచుపదార్థం వల్ల కడుపు నిండినట్లు అనిపించి శరీర బరువును తగ్గిస్తుంది.

వీటిలో అధిక స్థాయిలో మ్యుసిలెజ్ గమ్ కంటెంట్ ఉంటుంది. ఈ రకమైన పీచు పదార్ధం నీటిలో కరిగే గుణం కలిగి ఉంటుంది. దీనివల్ల ప్రేగులలో అద్భుతమైన లాభాలను కలిగిస్తుంది. ఇది శరీరంలో అధిక కొవ్వును తగ్గించుకోవడానికి ఉపయోగ పడుతుంది. పీచుపదార్థం అధికంగా ఉండడం వల్ల నెమ్మదిగా జీర్ణం అవుతుంది, తద్వారా ఎక్కువ సార్లు పిండి పదార్థాలు తినాలన్న కోరికను తగ్గిస్తుంది.

* మధుమేహాన్ని అదుపు చేయుటకు

అవిసె గింజలను రోజూ తీసుకోవడం వలన మధుమేహంతో బాధపడే వ్యక్తుల ఆరోగ్యం నిదానంగా మెరుగుపడుతుంది. 20 శాతం వరకు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తుందని అధ్యయనాలు వెల్లడించాయి. మరీ ముఖ్యంగా ఈ గింజలలోని ముసిలేజ్ జీర్ణక్రియను నెమ్మదిపరచి రక్తంలో గ్లూకోజ్ కలవడాన్ని నియంత్రిస్తుంది. అవిసె గింజలను తరచు తీసుకుంటే టైప్ 2 మరియు టైప్ 1 మధుమేహాలు రావడం ఆలస్యమయ్యేలా చేస్తుందని ప్రాధమిక అధ్యయనాల్లో తేలింది.

* ఆర్థరైటిస్ కు కేలిగే లాభాలు

అవిసె గింజలలో గల ఒమేగా-3, యాంటి-ఇన్ఫ్లమేటరీ స్వభావాలు కీళ్ల నొప్పులు, వాపులు, ఆర్థరైటిస్ లను తగ్గించడానికి ఉపయోగ పడతాయి. వేయించి పొడిచేసి అవిసె గింజల పొడిని అన్ని ఆహార పదార్ధాలలోనూ కలపవచ్చు.



Tags :
|

Advertisement