Advertisement

నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు

By: Sankar Wed, 08 July 2020 4:09 PM

నిమ్మరసం తాగడం వలన కలిగే ప్రయోజనాలు



కరోనా వైరస్ మహమ్మారి ఇప్పట్లో తగ్గేలా లేదు ..పోనీ వాక్సిన్ అయినా వచ్చేలా ఉందా అంటే అది లేదు.. దీనితో ప్రజలు తమంతట తామే కరోనా నుంచి రక్షించుకోవాలి ..దీనికి చేయాల్సిందల్లా రోగ నిరోధక శక్తిని పెంచుకోవడమే ..మరి రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయ పడేవి నిమ్మకాయలు ..ఇందులో ఉండే సి విటమిన్ శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ..

నిమ్మకాయ యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. దీని వల్ల వయసు పెరుగుతున్నా చర్మాన్ని త్వరగా ముడతలు పడనీయదు. నిమ్మలో దొరికినంత సి విటమిన్ పండ్లలోనూ లభించదు.

ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం కాస్త గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగితే మానసిక ఒత్తిడిని తగ్గించి నూతన ఉత్సాహాన్ని అందిస్తుంది నిమ్మకాయ.

పంటినొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల నుంచి వెలువడే రక్తస్రావాన్ని సైతం నియంత్రిస్తుంది.

శరీరంలో అతిముఖ్యమైన అవయవాలలో ఒకటైన కాలేయంలో పేరుకున్న విష పదార్థాలను సైతం నిమ్మకాయ తొలగిస్తుంది. కాలేయం పనితీరును మెరుగు పరుస్తుంది.

కొన్నిసార్లు పొరపాటున కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడితే.. నిమ్మరసం తాగిస్తే వారికి ఉపశమనం కలిగిస్తుంది.

వేసవికాలంలో అయితే అధిక చెమట రావడంతో కాస్త అలసత్వం అనిపిస్తుంది. రోజూ నిమ్మరసం తాగితే వేసవిలో ఎండ బారి నుంచి కాపాడుతుంది.

బరువు తగ్గాలనుకునేవారు ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీళ్లలో నిమ్మరసం కలుపుకుని తాగుతారు.

కిడ్నీలో ఏర్పడే చిన్న చిన్న రాళ్లను నిమ్మరసంలో ఉండే సిట్రిక్ యాసిడ్ కరిగిస్తుంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్న కారణంగానే నిమ్మరసం తాగాలని వైద్యులు తరచుగా సూచిస్తుంటారు.

Tags :
|
|

Advertisement