Advertisement

  • ధర ఎక్కువ అయినా కూడా ఈ కాయగూరల్లో ఉన్న అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

ధర ఎక్కువ అయినా కూడా ఈ కాయగూరల్లో ఉన్న అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు

By: Sankar Mon, 07 Sept 2020 7:37 PM

ధర ఎక్కువ అయినా కూడా ఈ కాయగూరల్లో ఉన్న అద్భుత ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు


సీజనల్ గా లభించే పండ్లు, కూరగాయలలో ఉండే పోషకాలు మన శరీరానికి చాలా మంచిది. అలాంటి వాటిలో ఆకాకర కాయలు ఒకటి. వీటిని ఎక్కువగా అటవీ ప్రాంతాల్లోనే పండిస్తారు. వీటి ధర కాస్త ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇది మన శరీరానికి అందించే ఆరోగ్యం ముందు ధర పెద్ద సమస్య కాదు.

1. ఆకాకర కాయల్లో క్యాలరీలు తక్కువ. వంద గ్రాముల ఆకాకరలో కేవలం 17 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి.

2. వర్షాకాలంలో విరివిగా లభించే వీటిని తరచుగా తీసుకోవడం వల్ల దగ్గు, జలుబు, వివిధ అలెర్జీలు దూరమవుతాయి.

3. ఆకాకర జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది. వీటిలో లభించే విటమిన్-సి ఇన్ఫెక్షన్లతో పోరాడుతుంది.

4. ఆకాకర కాయ కూర తినడం వల్ల మలబద్ధకం సమస్య కూడా దూరమవుతుంది.

5. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను క్రమబద్దీకరిస్తాయి. సాధారణ కాకరకాయ తరహాలోనే ఆకాకర కూడా డయాబెటిస్‌ను నియంత్రిస్తుంది.

6. ఆకాకరలోని ఫొలేట్ల వల్ల శరీరంలో కొత్త కణాలు వృద్ధి చెందుతాయి. ఇవి గర్భస్థ శిశువు ఎదుగుదలకు ఉపయోగపడతాయి. క్యాన్సర్ల బారిన పడకుండా ఆకాకర అడ్డుకుంటుంది.

7. ఈ కాయలను తరచుగా తినడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.

Tags :
|

Advertisement