Advertisement

ముల్లంగిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా

By: Sankar Sun, 09 Aug 2020 5:47 PM

ముల్లంగిలో ఎన్ని ఔషధ గుణాలు ఉన్నాయో తెలుసా



ముల్లంగిని చాలా మంది ఆహారానికి దూరంగా పెట్టేస్తారు. ఎందుకంటే గురించి సరైన అవగాహన లేకపోవడమే అందుకు ముఖ్య కారణం. కానీ నిజానికి ముల్లంగిలో మేలు చేసే ఔషధ గుణాలెన్నో పుష్కలంగా ఉన్నాయి. దీన్ని మన రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే చక్కని ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

1. ముల్లంగిని తినడం వల్ల లివర్ మరియు కడుపును మంచి కండీషన్ లో పెడుతుంది. అంతే కాదు, శరీరంలోని రక్తాన్ని శుభ్రం చేస్తుంది. ఇంకా ఎర్రరక్తకణాలకు ఆక్సిజన్ ను సప్లై చేస్తుంది. ముల్లంగి ఆకులను మరియు బ్లాక్ రాడిష్ ను జాండిస్ నివారణకు ఉపయోగిస్తారు.

2.ముల్లంగి శరీరంలోని విషాలను బయటకు నెట్టేసే గుణాలు చాలా ఉన్నాయి. ఇంకా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. పైల్స్ నివారణకు బాగా సహాయపడుతుంది. పైల్స్ అధికంగా కాకుండా అడ్డుకుంటుంది. ముల్లంగి జ్యూస్ మన జీర్ణక్రియకు బాగా సహాయపడి పైల్స్ రాకుండా అడ్డుపడుతుంది.

3. శరీరంలో ఏర్పడే మలినాలను తొలగించడానికి, మూత్ర సంబంధిత ఇన్ఫెక్షన్ ను తగ్గించడానికి మరియు యూరినేటింగ్ సమయంలో ఏర్పడే బర్నింగ్ సెన్షేషన్ వంటి వాటికి నివారిణిగా పనిచేస్తుంది. ముల్లంగిని తరచూ ఆహారంతో తీసుకోవడం వల్ల శరీరంలో మలినాలను బయటకు పంపడానికి సహాయపడే కిడ్నీలు మరియు యూరినరీ సిస్టమ్ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా కాపాడుతుంది.

4. బరువు తగ్గాలనుకొనే వారికి ముల్లంగి చాలా ఉపయోగకరం. ముల్లంగిలో జీర్ణక్రియ సక్రమంగా జరిగి విరేచనము సాఫీగా జరిగేందుకు ఉపయోగపడే పీచుపదార్థం మరియు కార్బోహైడ్రేట్స్ తో కలిగిన నీరును కలిగి ఉంటుంది. అందువల్ల బరువు పెరుగేందుకు సహకరించదు. ముల్లంగి క్యాలరీలు పెంచ కుండానే ఆకలిని సంత్రుప్తి పరుస్తుంది.

5. ముల్లంగిన మన డైలీ డయట్ లో చేర్చుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్ (కోలన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, కిడ్నీ కాన్సర్, మరియు ఓరల్ క్యాన్సర్ )లను రాకుండా కాపాడుతుంది. ముల్లంగిలో శరీరాన్ని డిటాక్సిఫైచేయడానికి, విటమిన్ సి, ఫోలిక్ యాసిడి మరియు యాంతోసినిన్ వల్ల యాంటిక్యాన్సర్ ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి

6. ముల్లంగిలో ఉండే విటమిన్ సి, ఫాస్పరస్, జింక్ మరియు విటమిన్ బి కాప్లెక్స్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల చర్మ సమస్యలను తొలగించి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగిని మంచి మాయిశ్చరైజర్ గా ఉపయోగిస్తారు. క్లెన్సర్ గాను మరియు ఫేస్ ప్యాక్ గాను ఉపయోగించడం వల్ల చర్మాన్ని సున్నితంగా..అందంగా మార్చుతుంది. చర్మానికి ముల్లంగిని ఉపయోగించడం వల్ల అధనపు ప్రయోజనాలు ఉన్నాయి. దీని వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతే కాదు ఇది చర్మం పై పడ్డ, రాషెస్ ను, పొడిబారడాన్ని, చర్మపగుళ్లు మొదలగునవి నివారిస్తుంది.

7. ముల్లంగి బాడీ టెంపరేచర్ ను తగ్గిస్తుంది. అందకు కారణం అయ్యే వాటిని నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. ముల్లంగి రసంలో కొద్దిగా బ్లాక్ సాల్ట్ కలిపి త్రాగడం వల్ల జ్వరానికి కారణం అయ్యే లక్షణాలతో పోరాడి, జ్వరాన్ని తగ్గిస్తుంది.







Tags :
|
|

Advertisement