Advertisement

బీరకాయతో బోలెడు లాభాలు

By: Sankar Thu, 08 Oct 2020 10:43 PM

బీరకాయతో బోలెడు లాభాలు


సాధారణంగా ప్రజలు బీరకాయను అప్పుడప్పుడు వినియోగిస్తుంటారు. కానీ బీరకాయ ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలిస్తే రోజు బీరకాయను వాడతారు. కేవలం బరువు తగ్గించడానికి మాత్రమే కాకుండా మరెన్నో ఆరోగ్య సమస్యలకు బీర సంజీవనిగా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి ఈ కూరగాయ తింటే ఎన్ని లాభాల్లో తెలుసుకుందాం

1. బరువు తగ్గాలనుకునే వారికి బీరకాయ మంచి ఔషధంగా పనిచేస్తుంది. సహజంగా బీరకాయలో ఫైబర్‌ ఎక్కువగా ఉండి, క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వును సైతం సులభంగా కరిగించే శక్తి బీరకాయ సొంతం.

2. నిత్యం బీరకాయను తినడం వల్ల శరీరంలో చక్కెర శాతాన్ని ఎక్కువ కాకుండా నివారిస్తుంది. మరోవైపు శరీరంలో ఇన్సూలిన్‌ ఉత్పత్తిని క్రమపద్ధతిలో ఉంచుతుంది. బీరలో శరీరానికి కావాల్సిన పెప్టైడ్స్‌, ఆల్క్‌లైడ్స్‌ ఎక్కువగా ఉండడం వల్ల శరీర రక్షణ వ్యవస్థను బలంగా ఉంచడంలో బీర కీలక పాత్ర పోషిస్తుంది. మధుమేహం ఉన్నవారు(డయాబెటిస్‌) నిత్యం బీరకాయను ఉపయోగించడం ఎంతో అవసరమని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.

3.ఆహార లోపాల వల్లే చర్మ సమస్యలు వస్తుంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు బీరకాయను నిత్యం వాడుతుంటే నిగనిగలాడే మెరిసే సోందర్యాన్ని సొంతం చేసుకోవచ్చు

4. ముఖ్యంగా మహిళలు సరియైన పోషకాహారం తీసుకోక రక్తహీనత సమస్యతో బాధపడుతుంటారు. ఐరన్‌ అందకపోవడమే రక్తహీనతకు ప్రధాన కారణం. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల కౌంట్‌లో ఐరన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే నిత్యం బీరకాయను తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్యకు చెక్‌ పెట్టవచ్చని నిపుణులు సూచిస్తున్నారు..

5. నిత్యం లివర్‌, నేత్ర(కళ్ల), సమస్యలతో బాధపడుతున్నారా. అయితే మీకు రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని అర్థం. ఆరోగ్య సమస్యలతో నిత్యం బాధపడేవాళ్లు బీరకాయను విరివిగా తీసుకోవడం వల్ల రక్షణవ్యవస్థను బలంగా ఉంచే విటమిన్లు, ఖనిజాలు, ఐరన్‌, మాగ్నిషియమ్‌, థయమిన్‌ తదితర పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోగాలను ఎదుర్కోవాలంటే బీరకాయను వాడాల్సిందే.

Tags :
|

Advertisement