Advertisement

  • పైనాపిల్ పండులో ఉండే అద్భుత పోషకాలు గురించి తెలిస్తే అసలు వదలరు

పైనాపిల్ పండులో ఉండే అద్భుత పోషకాలు గురించి తెలిస్తే అసలు వదలరు

By: Sankar Sun, 04 Oct 2020 10:19 PM

పైనాపిల్ పండులో ఉండే అద్భుత పోషకాలు గురించి తెలిస్తే అసలు వదలరు


చాలామంది అనాసపండు (పైనాపిల్) కొనేందుకు వెనకాడతారు. వాటిని కొయ్యడం పెద్ద శ్రమగా భావిస్తారు. కొందరు అవి పుల్లగా ఉంటాయనే కారణంతో అస్సలు ముట్టుకోరు. మీరు కూడా అదే పని చేస్తుంటే.. తప్పకుండా అనాసపండు ప్రయోజనాలను తెలుసుకోవల్సిందే. ఎందుకంటే.. ఈ పండును మీరు పట్టించుకోకపోవడం వల్ల ఆరోగ్యాన్ని పొందే అవకాశాలను వదులుకుంటున్నారు. అందుకే ఇప్పుడు పైనాపిల్ లో ఉండే ప్రయోజనాలు ఏంటి తెలుసుకుందాం

1. అనాస పండు పచ్చకామెర్ల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

2. అలాగే మూత్ర పిండాల్లో ఏర్పడే రాళ్లను కరిగించే గుణాలు ఇందులో ఉన్నట్లు పలు పరిశోధనల్లో తేలింది.

3. నడుము నొప్పి, ఇతరాత్ర ఒళ్లు నొప్పులతో బాధపడేవారికి కూడా ఈ పండు మంచిదే. అనాస పండు ముక్కలకు తేనెతో కలిపి తింటే శారీరక శక్తి లభిస్తుంది.

4. అనాస పండు అందాన్ని పెంపొందించడానికీ ఉపయోగపడుతుందట. చర్మం నిగారింపుకు ఎంతో మంచిదట.

5. గొంతు నొప్పి, పుండ్లతో బాధపడేవారు. అనాస పండు రసాన్ని తాగితే ఉపశమనం లభించవచ్చట.

6. పైనాపిల్ కంటి చూపును మెరుగుపరుస్తుంది. కాబట్టి.. తప్పకుండా పిల్లలకు ఇవ్వండి. ఇది ఎముకులు, శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది

Tags :
|

Advertisement