Advertisement

  • తాటి బెల్లం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

తాటి బెల్లం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు

By: Sankar Thu, 27 Aug 2020 6:29 PM

తాటి బెల్లం వలన కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు


తాటి బెల్లం ఇది మనం వాడుతున్న పంచదారకి ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనం రోజూ తినే పంచదార చెరుకు నుంచి తయారవుతుంది ఇలా తయారు చేసే సమయంలో ఇందులో ఉన్న పోషక విలువలు అన్నీ పోయి కేవలం తీపి మాత్రమే మిగులుతుంది దీనిలో తీపి రుచి తప్ప ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవు..అయితే సహజంగా లభించే తాటి బెల్లంలో అనేక ప్రజాయాణాలు ఉన్నాయి

1. ఆహారాన్ని జీర్ణంకి చాలా బాగా ఉపయోగపడుతుంది భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో, ఆహారాన్ని జీర్ణం చేయటానికి ఆహారాన్ని తీసుకున్న తరువాత చిన్న తాటి బెల్లం ముక్కను తింటారు ఇది తిన్న ఆహారం బాగా జీర్ణం చేస్తోంది మరియు పేగు శుభ్రపరచడానికి సహాయపడుతుంది.

2. తాటి బెల్లంలో ఇనుము సమృద్ధిగా ఉంటుంది .ఇది మీ రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది మరియు ఆస్తమా ని తగ్గిస్తుంది. మరో వైపు ఇందులో ఉన్న మెగ్నీషియం నాడీ వ్యవస్థను నిమంత్రిస్తుంది. ఇదిలో ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, పొటాషియం, మరియు భాస్వరం సమృద్ధిగా ఉంటాయి.

3. తాటి బెల్లంలో ఎక్కువగా శక్తి కలిగి ఉంటాయి ఇది చక్కెర కంటే త్వరగా జీర్ణం అవుతుంది దాన్ని క్రమంగా తీసుకుంటే నీరసం అనేది రాదు శరీరానికి ఎక్కువ శక్తిని అందజేస్తుంది దీనిని రోజు తీసుకోవడం వలన శరీర పుష్టి మరియు వీర్య వృద్ధి కలుగును

4.తాటి బెల్లం తినడం ద్వారా క్యాన్సర్ కారకాలతో పోరాడి క్యాన్సర్ రాకుండా చేస్తుంది అలాగే శరీరంలో ఉండే విష పదార్థాలను బయటికి పంపిస్తుంది. ఇది శ్వాసకోశ, ప్రేగులు, ఆహార గొట్టం, ఊపిరితిత్తులు మరియు చిన్న ప్రేగులు, పెద్ద ప్రేగులలో ఉండే విషపదార్థాలను బయటికి పంపించి, ప్రేగు కాన్సర్ రాకుండా చేస్తుంది. మీరు ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది

5. తాటి బెల్లం లో ఫైబర్ల ఎక్కువగా ఉంటుంది. ఈ ఫైబర్స్ మలబద్ధకం మరియు అజీర్తి చికిత్సకు సహాయపడతాయి. శరీరంలో హానికర టాక్సిన్స్ ను బయటకి పంపిస్తుంది. మలబద్దకం సమస్యను నివారిస్తుంది.

6. తాటి బెల్లం లో ఉండే పొటాషియం కొవ్వును కరిగించడంలో, అధిక బరువును తగ్గించడంలో మరియు బీపీ ని కంట్రోల్ చేయడంలో ఉపకరిస్తుంది. లివర్ కి స్నేహకారిగా ఉంటుంది. లివర్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.


Tags :
|
|

Advertisement