Advertisement

  • కమలా పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు...

కమలా పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు...

By: Sankar Wed, 21 Oct 2020 4:54 PM

కమలా పండ్ల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు...


చలికాలం అనగానే పిల్లలనీ, పెద్దలనీ కూడూ జలుబూ జ్వరాలు తరచూ వేధిస్తాయి. ఇవి మాత్రమే కాదు ఆస్తమా, బ్రాంకైటిస్, న్యుమోనియా వంటి సమస్యలుండే వారికీ ఇది గడ్డుకాలమే. ఇటువంటివారు తరచూ తీసుకోవాల్సిన ఆహారం కమలాలు. జలుబుతో ముక్కుమూసుకుపోయి బాధపడే పిల్లలకు కమలాలని తినిపించడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

1. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరిగి జలుబు రాకుండా ఉంటుంది. వీటిల్లో ఉండే బీటా కెరొటిన్ శరీరంలోని కణాలు ఆరోగ్యంతో తొణికిసలాడేట్టు చేస్తుంది. గర్భస్థ శిశువు మెదడు ఆరోగ్యంగా, చురుగ్గా ఉండేందుకు అవసరమైన ఫోలిక్ యాసిడ్‌నీ కమలా ఫలాలు అందిస్తాయి.

2. వీటిలో ఉండే బి6 విటమిన్ శరీరంలోని ప్రతి భాగానికీ ఆక్సిజన్ పుష్కలంగా అందేట్టు చేస్తుంది. దానివల్ల చేసే పనిలో చురుకుదనం ఉంటుంది. తెల్లరక్తకణాలు వృద్ధి చెంది వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా చలికాలంలో ఆస్తమా, వైరల్ ఇన్‌ఫెక్షన్లూ ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి. క్యాల్షియం తగినంత అంది ఎముక బలం చేకూరుతుంది. తరచూ కమలాలు తినడం వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా ఉంటాయి.

3. పొటాషియం, మెగ్నీషియం తగినంతగా లభించడం వల్ల గుండె జబ్బలూ రాకుండా ఉంటాయి. అధిక రక్తపోటు సమస్య తలెత్తకుండా ఉంటుంది. కమలా పళ్లలో థయామిన్ పోషకం ఎక్కువగా ఉండటం వల్ల తీసుకున్న ఆహారం కొవ్వుగా మారకుండా, సంపూర్ణమైన శక్తిగా మారే ప్రక్రియ చురుగ్గా సాగుతుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయి సమానంగా ఉంటుంది.

4. వీటిలోని కెరోటినాయిడ్స్‌ నైట్‌ బ్లైండెడ్‌నెస్‌, మస్క్యులర్‌ డిజనరేషన్‌ సమస్యల నుంచి కళ్లకు రక్షణ కల్పిస్తాయి.

5. కమలా పండ్లలోని విటమిన్లు, మినరల్స్‌ చర్మ ఆరోగ్యాన్ని పెంచుతాయి.

6. సిట్రస్‌ జాతి పళ్లు తినే వాళ్లకు కేన్సర్‌ వచ్చే అవకాశం 40 - 45శాతం వరకు తక్కువగా ఉన్నట్టు పరిశోధనల్లో తేలింది

7. విటమిన్‌ సి శరీరంలో ఉంటే బ్యాక్టీరియా, వైరస్‌లు దరిచేరవు. ఫలితంగా జలుబు, జ్వరాల ఇబ్బంది ఉండదు.

8. వ్యర్థాలను వడగట్టడంలో సహాయపడుతుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడకుండా రక్షణ కల్పిస్తుంది.

Tags :
|
|

Advertisement