Advertisement

బెల్లం తినడం వలన భలే లాభాలు..

By: Sankar Mon, 14 Sept 2020 11:36 AM

బెల్లం తినడం వలన భలే లాభాలు..


బెల్లం ..పండుగ వస్తే ఎక్కువగా పిండి వంటలు చేసుకోవడానికి వాడే పదార్ధం..తరచూ బెల్లం తీసుకోవడం అలవాటుగా చేసుకుంటే అనారోగ్యంబారిన పడకుండా ఉంటామని చెబుతున్నారు. స్వీట్లు, టీలలో చక్కెరకు బదులు బెల్లం వాడితే తీపికి తీపి.. ఆరోగ్యానికి ఆరోగ్యం అని అంటున్నారు. బెల్లం ప్రయోజనాలేంటో తెలుసుకోండి.

1. రోజూ రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది.

2. బెల్లం శరీరంలో వేడిని తగ్గిస్తోంది.

3. బెల్లంతో లివర్ సమస్యలు దూరమవుతాయి.

4. బెల్లంలో ఉండే ఐరన్ శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను పెంచుతుంది.

5. మలబద్దకం, గ్యాస్, ఏసీడీటీ సమస్యలు కూడా ఉండవు.

6. బెల్లం శ్వాసకోస సంబంధ సమస్యలను దూరం చేస్తుంది.

7. బెల్లం నుంచి విడుదలయ్యే ఎండోర్ఫిన్స్ శరీరానికి నొప్పుల నుంచీ ఉపశమనం కలిగిస్తాయి.

8. ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్‌తో బాధపడేవారికి బెల్లం మంచిది.

9. మొటిమలను తగ్గించి, చర్మ నిగారింపునకు సహకరిస్తుంది.

Tags :
|
|

Advertisement