Advertisement

ఔషధ గుణాలు మెండుగా ఉండే కాప్సికం ఉపయోగాలు

By: Sankar Sun, 05 July 2020 4:13 PM

ఔషధ గుణాలు మెండుగా ఉండే కాప్సికం ఉపయోగాలు



అసలే కరోనా భయంతో బతుకున్న రోజులు ఇవి ..ఇంకా కరోనా కు వాక్సిన్ కూడా రాకపోవడం వలన ప్రజలు తమంతట తామే రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడం అత్యంత ముఖ్యం ..అందుకే ప్రతి రోజు మనం తినే ఆహారంలో సి విటమిన్ ఉండేలాగా చూసుకోవాలి ..సి విటమిన్ అనగానే అందరూ సిట్రస్ జాతికి చెందిన నిమ్మ , బత్తాయి లాంటి వాటిల్లోనే ఉంటుంది అనుకుంటారు ..కానీ కూరగాయల్లో కూడా సి విటమిన్ సమృద్ధిగా దొరికేవి ఉన్నాయి .అందులో ముఖమైనది కాప్సికం ..దీనికే ఇంకో పేరు బెంగళూరు మిర్చి ..కాప్సికం చూడటానికి మిర్చి లాగానే ఉంటుంది ..బయట మార్కెట్లో ఇది వివిధ రంగుల్లో కనిపిస్తాయి. ఎరుపు, ఆరెంజ్, ఎల్లో రంగుల్లో కనిపించినా.. ఆకుపచ్చ రంగుల్లో ఉండే కాప్సికంను మాత్రమే ఎక్కువగా కూరల్లో వాడుతాము. ఒకరోజులో శరీరానికి కావాల్సిన 'సి' విటమిన్ ను ఒక్క క్యాప్సికం మాత్రమే అందిస్తుందని ఆహార నిపుణులు చెబుతున్నారు. ఇదేకాదు ఇలాంటి ఎన్నో ఔషధ గుణాలు ఇందులో ఉన్నాయని అంటున్నారు. అవేంటో మనమూ తెలుసుకుందాం.

* క్యాప్సికం నొప్పిని తగ్గించే పెయిన్ కిల్లర్ గా ఉపయోగపడుతుంది.

* జీర్ణక్రియను సక్రమంగా ఉంచుతుంది. డయేరియా, పొట్ట అల్సర్ ను దూరం చేస్తుంది

* ఇందులో ఏ, సి విటమిన్లు, ఫోలిక్ యాసిడ్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. 'ఏ' విటమిన్ వల్ల కంటి సమస్యలు నివారించవచ్చు.

* రోజువారీ ఆహారంలో క్యాప్సికం ను చేర్చుకుంటే సౌదర్యం పెరుగుతుంది. మొఖంపై మొటిమలు, మచ్చలు తగ్గుతాయి. చర్మాన్ని తాజాగా ఉంచుతుంది.

* బరువు, మధుమేహం నియంత్రణలో ఉంచడానికి, జుట్టు రాలిపోకుండా ఉండటానికి క్యాప్సికం తీసుకుంటే మంచిది.

* క్యాప్సికంలో ఉండే ‘కేయాన్’ మూలకం పెయిన్ రిలీఫ్ గా పనిచేస్తుంది. అలాగే ఆర్థరైటిస్, రుమటాయిడ్స్ ను నివారించడంలో సహాయపడుతుంది. ప్రస్తుతం దీంతో తయారుచేసిన ఆయింట్మెంట్ ను పెయిన్ రిలీఫ్ వాడుతున్నారు

* క్యాప్సికం క్యాన్సర్ నివారణలో ఎంతో ఉపయోగపడుతుంది, దీనిలో ఉన్న మూలకాలు రక్త కణాలతో కలిసి క్యాన్సర్ బారినుండి రక్షిస్తాయి.

Tags :
|

Advertisement