Advertisement

  • ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి తెలుసా

ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి తెలుసా

By: Sankar Wed, 19 Aug 2020 7:47 PM

ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన శరీరానికి ఎన్ని పోషకాలు అందుతాయి తెలుసా


గుడ్లు హై క్వాలిటీ ప్రొటీన్ కి బెస్ట్ సోర్స్. పైగా అవి అన్ని వేళలా అందుబాటులోనే ఉంటాయి కూడా. హెల్దీ బాడీ కి కావలసిన విటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎగ్స్ లో పుష్కలం గా ఉంటాయి.అందువలన ప్రతి ఒక్కరు ఎగ్స్ తినాలని ఆరోగ్య నిపుణులు చెప్తుంటారు..ఇక ఉడకబెట్టిన గుడ్లు తినడం వలన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అందుతాయి..

1. బాయిల్డ్ ఎగ్స్ లో ఉండే ప్రోటీన్ వల్ల వచ్చే ఎనర్జీ అతి ఆకలి వేయకుండా కాపాడుతుంది. దీని వల్ల ఎంత అవసరమో అంతే తింటాం. ఆటోమాటిక్‌‌గా వెయిట్ కంట్రోల్ లో ఉంటుంది. ప్రతి హార్డ్ బాయిల్డ్ ఎగ్‌లోనూ డెబ్భై క్యాలరీలు ఉంటాయి. కానీ, శాచ్యురేటెడ్ ఫ్యాట్ మాత్రం చాలా తక్కువ. బ్రేక్ ఫాస్ట్ లో రెండు ఎగ్స్ తినడం వల్ల కడుపు నిండుగా ఉంటుంది, రోజంతటికీ కావాల్సిన ఎనర్జీ కూడా వస్తుంది.

2. ఎగ్స్ నిజానికి గుండెకి చాలా మేలు చేస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్ వచ్చే రిస్క్ తగ్గించి కార్డియో వాస్క్యులర్ ఫంక్షన్స్ ని బూస్ట్ చేస్తాయి. ఎగ్స్ లో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఈ మేలుకి కారణం. ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ బ్లడ్ లో ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ నీ, తద్వారా కొలెస్ట్రాల్ నీ తగ్గిస్తాయి. ఇవి మెటబాలిజం ని కూడా రెగ్యులేట్ చేస్తాయి.

3. ఒక హార్డ్ బాయిల్డ్ ఎగ్ లో డెబ్భై ఐదు మైక్రో గ్రాముల విటమిన్ ఏ ఉంటుంది. ల్యుటేన్ ఒక యాంటీ-ఆక్సిడెంట్. ఇది రెటీనాని స్ట్రాంగ్‌గా చేసి మాక్యులర్ డీజెనరేషన్ జరిగే రిస్క్ ని తగ్గిస్తుంది. ఎగ్స్‌లో ఉండే ల్యుటేన్‌ని బాడీ ఈజీగా అబ్జార్బ్ చేసుకోగలుగుతుంది కూడా.

4. విటమిన్ డీ లభించే ఆహార పదార్ధాలు చాలా తక్కువ. వాటిలో హార్డ్ బాయిల్డ్ ఎగ్స్ కూడా ఒకటి. పళ్ళకీ, ఎముకలకీ విటమిన్ డీ చాలా మేలు చేస్తుంది. ఇది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్. ఫుడ్ లోంచి శరీరం కాల్షియం గ్రహించడానికి కూడా విటమిన్ డీ అవసరం. పైగా ఈ విటమిన్ బ్లడ్ లోని కాల్షియం లెవెల్స్ ని రెగ్యులేట్ చేస్తుంది.

5. హెయిర్, నెయిల్స్ స్ట్రాంగ్ గా ఉండాలంటే బాడీలో కెరటిన్ సరిగ్గా ఉండాలి. ఎగ్స్ లో ఉండే విటమిన్ డీ, బయోటిన్ ఈ కెరటిన్ ని డెవలప్ చేస్తాయి.

Tags :
|
|

Advertisement