Advertisement

ఉసిరి లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..

By: Sankar Sun, 25 Oct 2020 5:08 PM

ఉసిరి లో ఉన్న ప్రయోజనాలు తెలిస్తే అసలు వదలరు..


ఉసిరిని మిరాకిల్ ఫ్రూట్ అంటే అద్భుతమైన పండు అంటారు. ఎన్నో వ్యాధులకు ఇది రామబాణం లాంటిది. హిందు పౌరాణికాల ప్రకారం మనిషి శరీరం నుంచి వ్యాధులను తరిమికొట్టే ఎన్నో ఔషధగుణాలు ఉసిరిలో ఉన్నాయి.ఉసిరితో జామ్ లేదా చట్నీ కూడా చేస్తుంటారు. ఇలా వివిధ రకాలుగా ఉసిరిని తినడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయి

1. కొంత మందికి కళ్లు పచ్చరంగులో మారుతుంటాయి. ఉసిరి వల్ల అది తగ్గుతుంది. కంటికి చల్లదనం కలిగిస్తుంది..

2. నోటి పూత సమస్య ఉన్నవాళ్లు ఉసిరి తీసుకోవడం మంచిది.

3. కనుపాపలపై ఉసిరి రసాన్ని అప్లై చేస్తే కంటి నొప్పి తగ్గుతుంది.

4. ఉసిరి తరచూ తీసుకోవడం వల్ల మీ శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

5. నల్లని జుట్టు కావాలి అనుకుంటే ఉసిరి తినడం ప్రారంభించండి.

6. దీనిలో అద్బుతమైన యాంటి ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల వృద్ధాప్యంను దరిచేరనివ్వదు. తేనెతో కలపి ఆమ్లా జ్యూస్ ను త్రాగడం వల్ల ముఖం ఎల్లప్పుడు తాజాగా మెరుస్తుంటుంది.

7. ఉసిరి తీనటం వలన శరీరంలోని అదనపు కొవ్వును కరిగించుకోవచ్చు, అలాగే నిధానంగా బరువు కూడా తగ్గించుకోవచ్చు.

8. ఉసిరి జ్యూస్ ను ప్రతి రోజూ తీసుకోవడం వల్ల యూరినరి ప్రొబ్లెమ్స్ తగ్గించటంలో బాగా సహకరిస్తుంది. ఇంకా యూరినర్ బర్నింగ్ ను కూడా తగ్గిస్తుంది.


Tags :
|
|

Advertisement