Advertisement

కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

By: Dimple Wed, 19 Aug 2020 11:08 PM

కరోనా తగ్గాక తీసుకోవాల్సిన ఆహారం ఇదే..

★ కరోనా బారిన పడి తిరిగి కోలుకున్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి.. అనే విషయంలో ఎన్నో సందేహాలు ఉన్నాయి.

★ ఏది తినాలో తెలియక పొట్ట నిండా ఆహారం కురుకుంటున్నారు.

★ చివరికి జీర్ణం కాక అవస్థలు పడుతున్నారు.

★ అలా కాకుండా రోజంతా మితంగానే పౌష్టికాహారం తీసుకుంటే మేలని వైద్యులు చెబుతున్నారు.

★ సరైన పద్ధతిలో పోషకాహారం తీసుకుంటే తొందరగా రికవరీ అవొచ్చు.

★ శక్తినిచ్చే పిండి పదార్థాలు కొవ్వులు మాంసకృత్తులు విటమిన్లు ఖనిజాలు సరిపడా తీసుకుంటేనే తొందరగా కోలుకోవచ్చు.

★ ఉదయం సాయంత్రం తప్పనిసరిగా పాలు తీసుకోవాలి.

★ అల్పాహారంగా రాగి మాల్ట్ మొలకెత్తిన గింజలు తీసుకోవచ్చు.

★ ఉడికించిన గుడ్డు రోజుకు కనీసం రెండు సార్లు తీసుకోవడం మేలు.

★ కరోనా బారిన పడని వారికి కోలుకున్న వారికి విటమిన్ సి ఎంతో కీలకం.

★ అందుకే సిట్రస్ జాతి పండ్లు అయిన నిమ్మ ఆరెంజ్ ను కచ్చితంగా తీసుకోవాలి.

★ విటమిన్ సి లభించే క్యాప్సికం బ్రోకోలి క్యారెట్ పుట్టగొడుగులు ఆహారంలో చేర్చుకోవాలి.

★ వేడి నీళ్లలో తేనె నిమ్మరసం వేసి తీసుకుంటే సమృద్ధిగా విటమిన్ సి లభిస్తుంది.

★ మధ్యాహ్న భోజనంలో రొట్టె చేర్చాలి.

★ పప్పు ఆకుకూరలు విటమిన్ సి లభించే కూరగాయలు చికెన్ చేప తీసుకోవచ్చు.

★ సాయంత్రం సమయంలో స్నాక్స్ గా ఉడికించిన పల్లీలు శనగలు వేయించిన బఠానీలు నానబెట్టిన బాదం బొబ్బర్లు అలసందలు పెసలు తీసుకోవచ్చు.

★ ఈ పప్పు ధాన్యాలతో శక్తితో పాటు ప్రోటీన్లు ఐరన్ జింక్ వివిధ విటమిన్లు లభిస్తాయి.

★ గుమ్మడి గింజలతో అధికంగా జింకు పొందొచ్చు.

★ నీరసంగా ఉన్నవారు మాంసకృత్తులు అధికంగా లభించే నువ్వులను బాగా వాడాలి.

★ నువ్వులతో చేసే పచ్చళ్లతో పాటు బెల్లంతో నువ్వుల ఉండలు చేసుకొని ఆహారంగా తీసుకోవచ్చు.

★ రక్తహీనతకు నువ్వులతో చెక్ పెట్టొచ్చు.

★ ఎండు ఖర్జూరం ఎండు ద్రాక్ష తీసుకోవడం కూడా మేలే.

★ ఆకుకూరలు పాల కూర ఎంతో ప్రయోజనకారి.

★ విటమిన్ సి ఉండే పండ్లు కివి బొప్పాయి తీసుకోవాలి.

★ ఇలాంటి బలవర్ధకమైన ఆహారం తీసుకుంటే కరోనా బారిన పడ్డవారు తొందరగా కోల్పోవచ్చు.

★ వీటన్నిటికంటే కీలకమైనది సమయానికి తినడం సరిపడా నిద్ర.

Tags :
|
|

Advertisement