Advertisement

  • న్యూట్రీషన్ విలువలు ఎక్కువగా ఉండే అరటి పువ్వు

న్యూట్రీషన్ విలువలు ఎక్కువగా ఉండే అరటి పువ్వు

By: chandrasekar Mon, 29 June 2020 7:19 PM

న్యూట్రీషన్ విలువలు ఎక్కువగా ఉండే అరటి పువ్వు


అరటి పండ్లు మాత్రమే కాదు అరటి చెట్టులో ప్రతి ఒక్క భాగం మనకు ఉపయోగపడుతుంది. ప్రస్తుత కాలంలో చాలామంది వయసుతో సంబంధం లేకుండా అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బందిపడుతున్నారు. ఆ సమస్యలు మందులు వల్ల అప్పటికి తగ్గినా పూర్తిగా నయం కావు. మందుల ప్రభావం తగ్గగానే మళ్లీ తిరగబెట్టే అవకాశం ఉంటుంది.

అలాకాకుండా ప్రకృతిలో లభించే కొన్ని పదార్థాల ద్వారా అనేక ఆరోగ్య సమస్యలకు చెక్ పెట్టేయొచ్చు. అలాంటి వాటిల్లో అరటిపువ్వు ఒకటి. అంతే కాదు అరటి పువ్వులో న్యూట్రీషన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి . ఇది చాలారకాల ఆరోగ్య సమస్యలకు మెడిసిన్‌లా పనిచేస్తుంది. ఇప్పుడు అరటి పువ్వు మరిన్ని ఉపయోగాలను తెలుసుకుందాం.

* పీరియడ్స్ లో మహిళల్లో వచ్చే పొట్ట నొప్పిని తగ్గిస్తుంది. కొంత మంది, చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు, ఇంకొంత మందిలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. ఈ సమయంలో ఒక కప్పు, ఉడికించిన అరిటిపువ్వును, పెరుగును తీసుకోవడం వల్ల శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బ్లీడింగ్ ను తగ్గిస్తుంది. అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి మీ నాడీవ్యవస్థను సక్రమంగా పనిచేసేలా చేయడానికి సహాయపడతాయి.

* అరటిపువ్వుని తినడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

* అరటిపువ్వులో ఉంటే విటమిన్ సి వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంతేకాకుండా అరటి పువ్వు ఇన్ఫెక్షన్స్ ను నివారించడంలో కూడా సహాయపడుతుంది.

a banana,flower,with high,nutritional,value ,న్యూట్రీషన్, విలువలు, ఎక్కువగా, ఉండే అరటి, పువ్వు


* మగ వారు వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడుతుంటారు. అలంటి వారు అరటిపువ్వుని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల వీర్యవృద్ది జరిగి సంతానోత్పత్తి శక్తి పెరిగేలా చేస్తుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్ ఉండటం చాలా ప్రమాదకరం.

* అరటి పువ్వు రసంలో ఉండే మెథనోల్ యాంటీ ఆక్సిడెంట్స్ లక్షణాలు ప్రొసెస్ చేస్తుంది. దాంతో అనేక వ్యాధులకు చికిత్సనందిస్తుంది, ప్రీమెచ్యుర్ ఏజింగ్, మరియు క్యాన్సర్ ను కూడా నివారిస్తుంది.

* అరటిపువ్వును తీసుకోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. ఇంకా శరీరంలో హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. డిప్రెషన్ లో ఉన్నప్పుడు అరటి పువ్వును ట్రై చేయండి. అరటి పువ్వులో ఉండే నేచురల్ యాంటీ డిప్రెసెట్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ తగ్గిస్తుంది.

* బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో కొత్తగా తల్లైన వారు పాలు పడటం లేదని బాధపడుతుంటారు. బిడ్డకు సరిపడా పాలు అందివ్వాలంటే, రెగ్యులర్ డైట్ లో అరటి పువ్వును చేర్చుకోవడం వల్ల తల్లితో పాటు, బిడ్డకు కూడా ప్రయోజనాలు అందుతాయి. ఇన్ని ఆరోగ్య గుణాలున్న అరటిపువ్వు పల్లెటూరిలో విరివిగానే దొరుకుతుంది. అప్పుడప్పుడు ఈ పువ్వును తింటే ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

Tags :
|

Advertisement