Advertisement

  • నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల రద్దు కొరకు వేసిన పిటిషన్ ను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు

నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల రద్దు కొరకు వేసిన పిటిషన్ ను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు

By: chandrasekar Mon, 17 Aug 2020 10:57 PM

నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల రద్దు కొరకు వేసిన పిటిషన్ ను కొట్టిపారేసిన సుప్రీంకోర్టు


కరోనా వైరస్ నేపథ్యంలో నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల ను నిర్వహించరాదు అని 11 రాష్ట్రాల కు చెందిన 11 మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. విద్యార్థులు వేసిన పిటిష న్ ను కొట్టివేస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. జస్టిస్ అరుణ్ మిశ్రా, బీఆర్ గవాయి, కృష్ణమురారీలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించింది.

కరోనా మరో ఏడాది కొనసాగే అవకాశాలు ఉన్నాయి, మరి మీరు మరో సంవత్సరం ఇలాగే ఎదురుచూస్తారా అని జస్టిస్ అరుణ్ మిశ్రా పిటిషన్ వేసిన విద్యార్థుల్ని ప్రశ్నించారు. విద్యార్థుల పిటిషన్ తరపు న్యాయవాది అలోక్ శ్రీవాత్సవ్ వాదించారు. సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పరీక్షల తరహాలోనే నీట్, జేఈఈలను కూడా వాయిదా వేయాలని కోరారు. తామేమీ నిరవధిక వాయిదా కోరడం లేదన్నారు.

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తరపున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. పరీక్షల నిర్వహణ సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామన్నారు. పిటిషన్ను తిరస్కరించిన కోర్టు దీర్ఘకాలం పాటు విద్యార్థుల కెరీర్ ను ఆందోళనకు గురిచేయలేమని తెలిపింది.

Tags :
|

Advertisement