Advertisement

  • జబర్దస్త్ బ్యూటీ రష్మీ...చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'

జబర్దస్త్ బ్యూటీ రష్మీ...చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'

By: chandrasekar Thu, 10 Sept 2020 12:45 PM

జబర్దస్త్ బ్యూటీ రష్మీ...చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'


బుల్లితెరపై కనబడుతున్న యాంకర్ రష్మీ గౌతమ్ అప్పుడప్పుడూ వెండితెర ప్రేక్షకులను కూడా అలా పలకరించి వెళ్తుంటుంది. బుల్లితెరపై వచ్చిన సక్సెస్ వెండితెరపై రాకపోయినా అదృష్టం పరీక్షించుకుంటూ విభిన్న పాత్రలు పోషిస్తూ వస్తోంది ఈ జబర్దస్త్ బ్యూటీ. తాజాగా తన లేటెస్ట్ మూవీ 'బొమ్మ బ్లాక్‌బస్టర్' తన లుక్ షేర్ చేసింది. విజయీభవ ఆర్ట్స్ పతాకంపై ప్రవీణ్ పగడాల, బోస్ బాబు నిడిమోలు, ఆనంద్ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న చిత్రం 'బొమ్మ బ్లాక్‌బస్టర్'. ఈ చిత్రానికి రాజ్ విరాఠ్ దర్శకత్వం వహిస్తున్నాడు. టాలీవుడ్ న‌టులు నందు, రష్మీ గౌతమ్‌ జంటగా నటిస్తున్నారు.

ఇటీవలే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ విడుదల చేయగా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇందులో తన క్యారెక్టర్ పేరు చెబుతూ తన లుక్ పోస్ట్ చేసి అట్రాక్ట్ చేసింది రష్మీ గౌతమ్. పోతురాజు గాడి ల‌వర్ వాణిగా ఈ సినిమాలో కనిపించబోతున్నట్లు తెలిపిన ర‌ష్మీ గౌత‌మ్. త‌ల‌పై కిరీటం పెట్టుకుని చిరున‌వ్వులు చిందిస్తూ డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్న తన పోస్టర్ షేర్ చేసింది. ఈ పోస్టర్ చూసిన నెటిజన్లు.. ''వావ్! రియల్లీ బొమ్మ బ్లాక్‌బస్టర్'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలో నందు పోతురాజు పాత్ర పోషిస్తాడని, దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు ఫ్యాన్‌గా ఆయన నటన అట్రాక్ట్ చేస్తుందని అంటున్నారు చిత్ర యూనిట్ సభ్యులు.

Tags :
|
|

Advertisement