Advertisement

  • సినీ పరిశ్రమకు అండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...!

సినీ పరిశ్రమకు అండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...!

By: Anji Sat, 19 Dec 2020 9:00 PM

సినీ పరిశ్రమకు అండగా ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి...!

కరోనా కారణంగా థియేటర్లు బంద్ చేయడంతో చిత్ర పరిశ్రమ చాలా నష్టపోయింది. దీంతో సినీ ఇండస్ట్రీకి అండగా నిలిచేందుకు ఏపీ సీఎం జగన్, ఆయన మంత్రి మండలి పలు నిర్ణయాలు తీసుకుంది.

3 నెలల పాటు థియేటర్లు చెల్లించాల్సిన ఎలక్ట్రిసిటీ ఛార్జీలు రద్దు చేస్తున్నట్లు ఏపీ కేబినెట్ ప్రకటించింది. నెలకు రూ.3 కోట్ల రూపాయల చొప్పున ప్రభుత్వమే ఆ ఖర్చు భరిస్తున్నట్లు వెల్లడించింది.

మిగిలిన ఆరు నెలలు ఫిక్స్‌డ్‌ ఛార్జీలు చెల్లింపును వాయిదా వేసేలా కేబినెట్‌ ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1100 థియేటర్లకు లబ్ధి చేకూరనుంది.

రీస్టార్ట్‌ ప్యాకేజీ కింద వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణాలు, ఏ, బి సెంటర్లలో థియేటర్లకు రూ.10లక్షల చొప్పున, సి సెంటర్లలో ఉన్న థియేటర్లకు రూ.5లక్షల చొప్పున రుణాలు, వాయిదాల చెల్లింపుపై 6 నెలల మారటోరియం, తర్వాత ఏడాది నుంచి నాలుగున్నర శాతం వడ్డీనికి రాష్ట్ర ప్రభుత్వం భరించనుంది.

ఈ సందర్భంగా సినీ ఇండస్ట్రీకి అండగా నిలబడినందుకు ఏపీ సీఎం జ‌గ‌న్‌ కి, మంత్రి మండ‌లికి పలువురు సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు.

Tags :

Advertisement