Advertisement

అరెస్ట్ అయిన యూట్యూబ్ సంచలనం సునిశిత్...

By: Sankar Fri, 24 July 2020 07:29 AM

అరెస్ట్ అయిన యూట్యూబ్ సంచలనం సునిశిత్...



స్మార్ట్ ఫోన్లు వచ్చిన తర్వాత ఎవ్వరు ఎలా ఎందుకు ఫెమస్ అవుతున్నారో కూడా తెలియడం లేదు ..ఇలా నోటికి వచ్చింది మాట్లాడి ఇటీవల కాలంలో యూట్యూబ్ లో తెగ హడావిడి చేసిన వ్యక్తి సునిశిత్..టాలీవుడ్ లో ప్రముఖ హీరోయిన్ల మీద కామెంట్స్ చేస్తూ , ఆ సినిమాలో నేను హీరో , ఈ సినిమా నాదే అంటూ నోటికి వచ్చినట్లు మాట్లాడాడు ..

అయితే హీరోయిన్‌లు తన లవర్స్‌ అంటూ హంగామా చేస్తన్న సునిశిత్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సునిశిత్‌ యూట్యూబ్‌ చానళ్లకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో.. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు హీరోయిన్లు తనకు తెలుసని చెప్పిన సంగతి తెలిసిందే. అలాగే వారి వ్యక్తిగత జీవితాలపై ఆరోపణలు కూడా చేశాడు. అసభ్య పదజాలంతో వారిని దూషించాడు..

ఈ క్రమంలోనే సునిశిత్‌పై ఇబ్రహీంపట్నం, కీసర పోలీసు స్టేషన్‌లలో కేసులు నమోదయ్యాయి. దీంతో రంగంలోకి దిగిన కీసర పోలీసులు తాజాగా సునిశిత్‌ అరెస్ట్‌ చేశారు. కాగా, తనపై అసత్య ప్రచారం చేస్తున్న సునిశిత్‌పై గతంలో హీరోయిన్‌ లావణ్య త్రిపాఠి పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు మెయిల్‌ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. శ్రీరామోజు సునిశిత్ అనే వ్యక్తి తనను పెళ్లి చేసుకున్నాడని అసత్య ప్రచారం చేస్తున్నారని లావణ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు

Tags :
|
|

Advertisement