Advertisement

  • ఓ వెబ్ సిరీస్ మొదలెట్టే ప్రయత్నంలో యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ

ఓ వెబ్ సిరీస్ మొదలెట్టే ప్రయత్నంలో యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ

By: chandrasekar Tue, 18 Aug 2020 4:06 PM

ఓ వెబ్ సిరీస్ మొదలెట్టే ప్రయత్నంలో యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ


తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘పెళ్లి చూపులు’ సినిమాతో క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇక ఆ తర్వాత సందీప్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో స్టార్ హీరో అయ్యాడు విజయ్. ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ సినిమాలతో మరింతగా ఎదిగాడు. కాగా ఆయన ఇటీవల నటించిన 'డియర్ కామ్రెడ్', వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు కొంత నిరాశ పరిచాయి.

ఆయన ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ‘ఫైటర్‌’గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ద్వారా విజయ్ హిందీ చిత్ర సీమకు పరిచయం కాబోతున్నాడు. ఈ ఫైటర్‌ను తెలుగు, హిందీతో పాటు అన్ని సౌత్ భాషలలో ఒకేసారి తెరకెక్కించనున్నారు. ఫైటర్ కథ పాన్ ఇండియాకు అప్పీల్ అవుతుందని భావించిన కరణ్ జోహార్, పూరి, ఛార్మిలతో కలిసి ఈ చిత్ర నిర్మాణంలో పాలు పంచుకుంటున్నాడు. ఈ సినిమా షూటింగ్‌లో ఉండగానే ఆయన మరో రెండు సినిమాలకు ఓకే చెప్పాడు.

శివ నిర్వాణ దర్శకత్వంలో ఓ సినిమాకు ఓకే అన్న విజయ్ ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో మరో సినిమాకు ఓకే చెప్పినట్లు సమాచారం. అది అలా ఉంటే విజయ్ డిజిటల్‌లోకి ప్రవేశిస్తున్నాడని తాజా సమాచారం. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకి సంబంధించిన స్టార్స్ డిజిటల్ రంగంపై ఆసక్తి కనబరుస్తున్నారు.

ఇప్పటికే సమంత అమెజాన్ ది ఫ్యామిలీ మెన్ 2 వెబ్ సిరీస్‌లో నటింస్తోండగా, ఆమె బాటలో కాజల్, తమన్నా, షాలినీ పాండే ఇలా పలువురు స్టార్స్ పయనిస్తున్నట్టు తెలుస్తుంది. తాజాగా యూత్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఓ వెబ్ సిరీస్ మొదలెట్టే ప్రయత్నాలు చేస్తున్నాడట. అల్లు అరవింద్ పార్ట్‌నర్‌గా ఉన్న 'ఆహా' అనే ఓటీటీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్న విజయ్ ఆహాకి సంబంధించిన కొన్ని వెబ్ సిరీస్‌లలో పాలుపంచుకోబోతున్నాడు.

విజయ్ నిర్మాణ సంస్థ అయిన కింగ్‌ ఆప్ ది హిల్స్ తరపున ఓ రెండు వెబ్ సిరీస్‌లు రానున్నాయట. అందులో భాగంగా ఓ ప్రాజెక్టుని కేవీఆర్ మహేంద్రకి అప్పజెప్పే అవకాశాలున్నాయి. మహేంద్ర గతంలో విజయ్ తమ్ముడు ఆనంద్ ప్రధాన పాత్రలో దొరసాని అనే సినిమా తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఇక మరో ప్రాజెక్ట్‌ను సందీప్ వంగతో కలిసి విజయ్ దేవరకొండ నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వెబ్ సిరీస్‌లో ఆనంద్ దేవరకొండ లీడ్ రోల్ చేస్తాడట. ఇలా మొత్తానికి ‘అర్జున్ రెడ్డి’ కాంబినేషన్ లో మ‌రో ఓ వెబ్ సిరీస్ రాబోతంది అన్నమాట.

Tags :
|

Advertisement