Advertisement

  • ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవి గా నటించిన తేజ హీరోగా కొత్త సినిమాలు ప్రకటన

ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవి గా నటించిన తేజ హీరోగా కొత్త సినిమాలు ప్రకటన

By: Sankar Sun, 23 Aug 2020 3:21 PM

ఇంద్ర సినిమాలో జూనియర్ చిరంజీవి గా నటించిన తేజ హీరోగా కొత్త సినిమాలు ప్రకటన


బాలనటుడిగా యాబై కి పైగా సినిమాల్లో అలరించి ఇప్పుడు హీరో గా అరంగేట్రం చేస్తున్న నటుడు తేజ ..ఈరోజు (ఆగస్టు 23న) తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా తేజ హీరోగా వస్తోన్న రెండు సినిమాల నుంచి అప్‌డేట్స్ వచ్చాయి.ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘జాంబీ రెడ్డి’ సినిమా ద్వారా తేజ హీరో గా చేస్తున్నారు ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను ఈరోజు విడుదల చేశారు.

అలాగే, తేజ హీరోగా మరో సినిమా కూడా వస్తోంది. ఈ సినిమాలో తేజ లుక్‌ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై చంద్ర శేఖర్ మొగుల్ల, ఎస్.ఒరిజినల్స్ సృజన్ యరబోలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శివానీ రాజశేఖర్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు.

ఫాంటసీ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. సినిమా గురించి నిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘ఫాంటసీ లవ్ స్టోరీ నేపథ్యంలో ఈ కథ అంతా జరుగుతుంది. డైరెక్టర్ మల్లిక్ రామ్ చెప్పిన కథకు అందరం కనెక్ట్ అయ్యాం. ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మించాం. మూవీ చాలా బాగా వచ్చింది. తేజ, శివానీ రాజశేఖర్ ఇందులో లీడ్ రోల్స్ చేశారు. షూటింగ్ అంతా కంప్లీట్ అయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చక్కబడిన తర్వాత మూవీని రిలీజ్ చేస్తాం’’ అని అన్నారు.


Tags :

Advertisement