Advertisement

  • పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా పవన్ కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటో షేర్ చేసిన సాయిధరమ్ తేజ్

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా పవన్ కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటో షేర్ చేసిన సాయిధరమ్ తేజ్

By: Sankar Wed, 02 Sept 2020 09:39 AM

పవర్ స్టార్ బర్త్ డే సందర్భంగా పవన్ కాళ్ళ దగ్గర కూర్చున్న ఫోటో షేర్ చేసిన సాయిధరమ్ తేజ్


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ఫాన్స్ హంగామా అంత ఇంతా కాదు కళ్యాణ్ ట్వీట్లతో ట్విట్టర్ హీటెక్కిపోతుంది.

ట్విట్టర్‌లో సరికొత్త రికార్డుల దిశగా పవన్ కళ్యాణ్ దూసుకుపోతున్నారు. ఈ తరుణంలో అభిమానుల్ని ఉత్సాహపరుస్తూ.. తన మేనమామకు పుట్టినరోజు విషెష్ అందిస్తూ మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ పెట్టిన ఫొటో పవన్ ఫ్యాన్స్‌తో విజిల్స్ వేయించేట్టుగా ఉంది.

సాయి ధరమ్ తేజ్ చిన్నప్పుడు తన మామ పవన్‌తో ఆడుకుంటూ అతని కాళ్లను పట్టుకుని దర్జాగా కూర్చుని ఉన్నాడు.. పడుకుని ఉన్న పవన్.. సాయి తేజ్ పడిపపోకుండా తన కాళ్లను మడిచిపట్టుకుని మేనల్లుడ్ని చూస్తూ ఉన్నారు. ఈ మామా అల్లుళ్ల రేర్ పిక్‌కి పవన్ బర్త్ డే సందర్భంగా షేర్ చేసిన సాయి ధరమ్ తేజ్.. అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడూ అనే క్యాప్షన్ ఇచ్చి.. పవన్ అభిమానుల హృదయాలను కొల్లగొట్టేశాడు. మేం ఎంత ఎత్తుకి ఎదిగినా నీ కాళ్ల దగ్గరే అనే అర్థంలో సాయి ధరమ్ ఈ ఫొటో వదలడంతో పవన్ అభిమానులు రీ ట్వీట్లతో వైరల్ చేస్తున్నారు..

Tags :
|

Advertisement