Advertisement

  • రెడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ..క్లాస్ మాస్ పాత్రల్లో అదరగొట్టిన రామ్

రెడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ..క్లాస్ మాస్ పాత్రల్లో అదరగొట్టిన రామ్

By: Sankar Thu, 24 Dec 2020 12:50 PM

రెడ్ మూవీ ట్రైలర్ రిలీజ్ ..క్లాస్ మాస్ పాత్రల్లో అదరగొట్టిన రామ్


ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ మంచి ఊపు మీద నటుడు హీరో రామ్ ...తాజాగా రెడ్ అనే సినిమాలో నటిస్తున్నాడు..తనకు నేను శైలజ సినిమాతో సూపర్ హిట్ ఇచ్చిన కిషోర్ తిరుమల దర్శకత్వంలో చేస్తున్నాడు..ఇది తమిళ మూవీ ‘తడమ్‌’కు ఇది రీమేక్‌..

ఈ సినిమాలో రామ్‌ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. నివేదా పేతురాజ్, మాళవికా శర్మ, అమృతా అయ్యర్‌లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల మందుకు తీసుకురానున్నారు.

ఈ నేపథ్యంలో గురువారం చిత్రబృందం సినిమా ట్రైలర్‌ని విడుదల చేసింది. ఇందులో రామ్‌ రెండు విభిన్న పాత్రల్లో నటించినట్లు చూపించారు.ఒకరు క్లాస్‌ అయితే మరొకరు ఊర మాస్‌.నచ్చిన అమ్మాయి.. కోరుకున్న ఉద్యోగంతో లైఫ్ సాఫీగా సాగిపోతోన్న సమయంలో హీరో లైఫ్‌లోకి ఓ వ్యక్తి ఎంట్రీతో ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయో చెబుతూ ట్రైలర్‌ను మొదలవుతుంది. ఇందులో రెండు గెటప్‌లతో రామ్ అదరగొట్టాడు....

Tags :
|

Advertisement